News August 31, 2025

HYD: ఈ జిల్లాల్లో క్యాన్సర్ కేర్ యూనిట్లు..!

image

క్యాన్సర్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. HYD, RR, MDCL, VKB జిల్లాల్లో క్యాన్సర్ కేర్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. HYD పరిధి MNJ క్యాన్సర్ ఆస్పత్రి, NIMS ఆసుపత్రులలో ప్రస్తుతం వైద్యం అందుబాటులో ఉండగా, వైద్య చికిత్స విస్తరణపై ఫోకస్ చేసిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Similar News

News September 1, 2025

NIMSలో పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు

image

నేటి నుంచి పంజాగుట్టలోని నిమ్స్‌లో చిన్నారులకు బ్రిటన్ వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత గుండె ఆపరేషన్లు జరగనున్నాయి. ఈ శిబిరం సెప్టెంబర్ 21 వరకు జరగనుంది. మంగళ, గురు, శుక్రవారాలలో ఉదయం 8:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు ఆస్పత్రిలో సంప్రదించవచ్చు. పుట్టుకతో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పిల్లలను పరీక్షించి, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తారు.
SHARE IT

News August 31, 2025

మోమిన్‌పేటలో భర్తను చంపేసిన భార్య

image

మోమిన్‌పేట మండలం కేసారంలో దారుణం చోటుచేసుకుంది. బంట్వారం మండలం రొంపల్లికి చెందిన కురువ కుమార్ (36), రేణుక (34) భార్యభర్తలు. కేసారంలోని ఒక వెంచర్‌లో పని చేస్తున్నారు. రోజూ మద్యం తాగి భార్యను వేధిస్తున్న కుమార్ ఆదివారం మద్యం మత్తులో వచ్చి రేణుకను కొట్టాడు. వేధింపులు తాళలేక ఆమె భర్త కళ్లల్లో కారం కొట్టింది. ఓ వైర్‌ను మెడకు బిగించి హత్య చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 31, 2025

జూబ్లీహిల్స్‌‌లో గెలిపిస్తే ఏడాదిలో లక్ష ఉద్యోగాలు: KA పాల్‌

image

రానున్న ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే ఏడాదిలో నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలను ఇప్పిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ కేఏ పాల్‌ తెలియజేశారు. యూసుఫ్‌గూడ డివిజన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనంతరం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా విమర్శలు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశం అల్లకల్లోలం అవుతోందన్నారు.