News July 18, 2024
HYD: ఈ నెల 20న గోపాన్‌పల్లి ఫ్లై ఓవర్ ప్రారంభం

గచ్చిబౌలి డివిజన్ పరిధి గోపన్‌పల్లి ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ నెల 20న వంతెనను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పనులు తుదిదశకు చేరుకున్నాయని MLA చెప్పారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
Similar News
News August 26, 2025
HYD: సమ్మయ్య సారూ.. సరిలేరు మీకెవ్వరూ!

క్లాస్ రూమ్‌లో పాఠాలు చెప్పే మాస్టారు మారథాన్‌లో పరుగులు తీస్తున్నారు. మారేడ్‌పల్లి శ్రీ రాఘవ లక్ష్మిదేవి జూ.కాలేజీలో హిస్టరీ లెక్చరర్ సమ్మయ్య HYD రన్నర్స్ సొసైటీ(NMDC-2025) ఆధ్వర్యంలో నిర్వహించిన మారథాన్‌ను కంప్లీట్ చేశారు. 42 ఏళ్ల వయసులో 42KM పరిగెత్తడం విశేషం. యువత ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. సమ్మయ్య ప్రతిభను ప్రిన్సిపల్ A.భాగ్యలక్ష్మి, లెక్చరర్లు, విద్యార్థులు అభినందించారు.
News August 26, 2025
ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు

ఈనెల 27- SEP 6 వరకు ఖైరతాబాద్ బడా గణేశ్ ఉత్సవాల సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రోజూ ఉ.11 నుంచి రద్దీని బట్టి ప్రధాన మార్గాలైన VV స్టాచ్యూ, సైఫాబాద్ పాత PS, నెక్లెస్ రోటరీ వైపుల నుంచి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లిస్తామన్నారు. భక్తులు మెట్రో, బస్సులు వంటి ప్రజారవాణాను ఉపయోగించాలాన్నారు. ఐమాక్స్, విశ్వేశ్వరయ్య భవన్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు.
News August 26, 2025
HYD: అంతర్జాతీయ పోటీల్లో ‘FIRE’ కానిస్టేబుల్

HYD అగ్నిమాపక కానిస్టేబుల్ అవుల నరసింహ, ఐసీఎన్ ప్రో కార్డ్ గెలుచుకుని అంతర్జాతీయ బాడీబిల్డింగ్ పోటీలకు అర్హత సాధించారు. ‘Mr. Fit Cop’గా పేరుగాంచిన నరసింహ, తన వృత్తిని, క్రీడా జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ ఘనతతో భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. నరసింహను పలువురు అభినందించారు.