News February 24, 2026
HYD: ఈ ప్రాంతాల్లో నిన్నటి నుంచి వర్షం

GHMC పరిధిలో సోమవారం రాత్రి వరకు పలుచోట్ల వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి శివారు పెద్దఅంబర్‌పేట్, ఇబ్రహీంపట్నం పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నిన్న హస్తినాపురంలో 17.5MM, సులేమాన్‌నగర్‌లో 14.5MM, అత్తాపూర్ 13.5 MM వర్షం కురిసింది. వనస్థలిపురం ఎన్‌జీఓకాలనీ, శాస్త్రిపురం, రాజేంద్రనగర్‌లో 12 MM చొప్పున, సెట్విన్ ట్రైనింగ్ సెంటర్ వద్ద 9.3MM వర్షపాతం నమోదైనట్లుగా TGDPS తెలిపింది.
Similar News
News February 25, 2026
కాకినాడ: రూ.8కోట్ల డ్వాక్రా నిధుల గోల్‌మాల్.. రికవరీపై నిర్లక్ష్యం!

కరప, తూరంగి, యూ.కొత్తపల్లి, పిఠాపురం మండలాల్లోని డ్వాక్రా సంఘాల్లో సుమారు రూ.8 కోట్లకు పైగా నిధులు మాయమవ్వడం కలకలం రేపుతోంది. తాము చెల్లించినా మళ్లీ అప్పులు కట్టాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో డీఆర్‌డీఏ పీడీ నిర్లక్ష్యం వహిస్తున్నారని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని బాధితులు తెలిపారు.
News February 25, 2026
వైద్యుల తొలగింపుతో కొత్త నియమకాలకు అవకాశం!

వైద్య కళాశాలలలో ఫ్యాకల్టీ ఉండి విధులకు హాజరు కాక వైద్య విద్యార్థులకు సరైన విద్యా అందడం లేదు. దీనికి కారణాలపై విశ్లేషించిన ప్రభుత్వం విధులకు హాజరు గాని వైద్యులను ఉద్యోగాల నుండి తొలగించి కొత్తగా నియమకాలు చేపట్టాలన్న నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 94 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను తొలగించగా, అందులో ఉమ్మడి జిల్లా నుంచి 17 మంది ఉన్నారు. వీరి స్థానంలో త్వరలోనే కొత్త నియమకాలు ప్రభుత్వం చేపట్టనున్నారు.
News February 25, 2026
అంగన్వాడీల్లో 7,000 పోస్టులు భర్తీ చేస్తాం: మంత్రి సంధ్యారాణి

AP: అంగన్వాడీల బలోపేతానికి కృషి చేస్తున్నామని మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. ఇందులో భాగంగా 7,000 ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. 55,746 అంగన్వాడీ కేంద్రాలు, 257 ICDS ప్రాజెక్టుల ద్వారా గర్భిణులు, బాలింతలు, 6 ఏళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ సెంటర్లలో హాజరు శాతం 70 నుంచి 96 శాతానికి చేరిందన్నారు.


