News August 23, 2025

HYD: ఈ ప్రాంతాల్లో HMDA ఓపెన్ ప్లాట్ల విక్రయం.!

image

HMDA త్వరలోనే తుర్కయంజాల, బాచుపల్లి ప్రాంతాల్లో 82 ప్లాట్లను విక్రయించేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. ఆ తర్వాత మిగతా స్థలాలు అమ్మనున్నారు. బాచుపల్లి పరిధిలో 70ప్లాట్లు, తుర్కయంజాల పరిధిలో 12 ప్లాట్లు ఉన్నాయి. దశలవారీగా బైరామల్‌గూడ, కోకాపేట, చందానగర్, బాచుపల్లి, బౌరంపేట, చెంగిచెర్ల, సూరారం, పూప్పాలగూడ ప్రాంతాల్లోని ప్లాట్లను సైతం HMDA విక్రయించనుంది.

Similar News

News February 12, 2026

ఓహో.. ‘బేగంపేట’కు ఆ పేరు ఇలా వచ్చిందా?

image

బేగంపేటకు ఉన్న చారిత్రక నేపథ్యం నిజాం కాలానికి చెందింది. ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ తన కుమార్తె బషీర్ ఉన్నిసా బేగంకు ఉమ్రన్ అమిర్‌తో వివాహం చేశారు. ఆ సందర్భంగా కట్నంగా ఒక విలువైన స్థలాన్ని ఆమెకు దానం చేశారు. ఆ భూమి బషీర్ ఉన్నిసా బేగం పేరిట నమోదు కావడంతోనే కాలక్రమేణా ఆ ప్రాంతం ‘బేగంపేట’గా ప్రసిద్ధి చెందింది. నిజాం రాజవంశ వైభవానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం.

News February 12, 2026

HYD: ఆస్తిని లాక్కొని.. తండ్రిని గెంటేసిన కూతుర్లు

image

ఆస్తి కోసం కన్నతండ్రిని కుమార్తెలే వీధిన పడేసిన అమానవీయ ఘటన మారేడుపల్లి సెకండ్ లక్ష్మీనగర్‌లో కలకలం రేపింది. మిథాని రిటైర్డ్ ఉద్యోగి రాజలింగం తనకున్న 130 గజాల స్థలాన్ని ఇద్దరు కుమార్తెల పేరిట రాసిచ్చారు. రిజిస్ట్రేషన్ పూర్తవగానే వారు ఆయన్ని ఇంటి నుంచి గెంటివేశారు. తిండి పెట్టకుండా బయటకు పంపడంతో బాధితుడు కుమార్తెల ఇంటి ముందే ఆందోళనకు దిగారు. ప్రస్తుతం బస్తీవాసులే ఆయనకు ఆశ్రయమిచ్చి ఆదుకుంటున్నారు.

News February 12, 2026

HYD: ఆన్‌లైన్‌‌లో కీసర గుట్ట దర్శనం టికెట్లు

image

కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని ఆలయ EO కట్టా సుధాకర్ రెడ్డి, ఛైర్మన్ తటాకం వెంకటేశ్ శర్మ తెలిపారు. మహా శివరాత్రి సందర్భంగా 14న స్వామివారి కళ్యాణానికి సంబంధించిన టికెట్లు, VIP దర్శనం, అభిషేకానికి సంబంధించిన టికెట్లు keesaragutta.telangana.gov.inలో పొందవచ్చు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని EO సూచించారు.
SHARE IT