News January 5, 2026
HYD: ఈ రూట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

నగరంలోని ప్రధాన జంక్షన్ల వద్ద సాయంత్రం నుంచి విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. KBR పార్క్ నుంచి పంజాగుట్ట రూట్, ప్రజాభవన్ నుంచి బేగంపేట, మాసబ్‌ట్యాంక్ నుంచి ఓల్డ్ సైఫాబాద్ PS రూట్‌లో వాహనాల కదలిక మందగించింది. పీక్ అవర్స్ కావడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణం ఆలస్యం కాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
SHARE IT
Similar News
News February 18, 2026
HYDలో మళ్లీ 2BHK ఇండ్లు

HYD జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, రెండు పడకల గదుల ఇండ్లపై సమీక్షించారు. స్థలాలు సేకరించి G+5-10 ఇందిరమ్మ ఇళ్లు కట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న 2BHK ఇళ్ల పనులు కూడా పూర్తి చేసి అర్హులకు అందించాలని అధికారులకు మంత్రి సూచించారు.
News February 18, 2026
భూభారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి: ASF కలెక్టర్

బుధవారం ASF కలెక్టరేట్‌లో భూ సమస్యలపై కలెక్టర్ హరిత సమీక్ష నిర్వహించారు. భూభారతి పోర్టల్‌లో వచ్చిన దరఖాస్తులను తహశీల్దార్ ఫైళ్లతో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని సూచించారు. తిరస్కరణల కారణాలు నమోదు చేయడం, ప్రజావాణి సమస్యల పరిష్కారం, కారుణ్య నియామకాల కింద వచ్చిన దరఖాస్తుల నివేదికలను సమర్పించడాన్ని పర్యవేక్షించాలని వివరించారు.
News February 18, 2026
హైదరాబాద్‌లో మళ్లీ 2BHK ఇండ్లు