News April 12, 2024
HYD: ఈ లొకేషన్లలో కిలో బియ్యం రూ.29 మాత్రమే!
HYD నగరంలో కిలో రూ.29 భారత్ రైస్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఏపీ రైస్ స్టోర్ మెట్టుగూడ, చంద్రమౌళి ట్రేడర్స్ కార్వాన్, ధనలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ SR నగర్, డింగ్ డాంగ్ సూపర్ మార్కెట్, కాప్రా గౌతమ్ రైస్ డిపో, లంగర్ హౌజ్ జై తుల్జా భవాని ఏజెన్సీ, ఆర్కేపురం మాణిక్య ట్రేడర్స్, మురళి కిరాణా అండ్ జనరల్ స్టోర్ పటాన్ చేరు, ముత్తయ్య గ్రాండ్ బజార్ శేర్లింగంపల్లి, కైసర్ కిరాణా అండ్ జనరల్ స్టోర్ HYDలో పొందవచ్చు.
Similar News
News January 5, 2025
HYDలో IT శిక్షణకు అడ్డాగా అమీర్‌పేట
హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) సంబంధిత కోర్సుల శిక్షణకు అమీర్‌పేట అడ్డాగా మారింది. 1992 నుంచి ఇక్కడ ఐటీ శిక్షణ కొనసాగుతోంది. పైథాన్, డాట్ నెట్, డిజిటల్ మార్కెటింగ్, జావా, సీ ప్లస్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్ వంటి విభిన్న కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన ఎంతో మంది ఐటీ కొలువుల్లో రాణిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News January 4, 2025
HYD: మంత్రులను, డీజీపీని కలిసిన హైడ్రా కమిషనర్
HYDలో మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, డీజీపీ జితేందర్‌ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ కలిశారు. వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హైడ్రా తీసుకోబోయే చర్యలపై విస్తృతంగా చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. చట్టపరంగానే చెరువులు, ప్రభుత్వ భూములకు రక్షణ కల్పిస్తామన్నారు.
News January 4, 2025
HYDకు వచ్చే మంచినీరు ఈ నదుల నుంచే..!
నగరానికి ప్రస్తుతం మంజీరా, సింగూరు, గోదావరి, కృష్ణా నుంచి నీటి సరఫరా జరుగుతోందని జలమండలి తెలిపింది. గోదావరి ఫేజ్-2 ద్వారా మరిన్ని నీటిని తరలించి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ వరకు తాగునీటి సరఫరాకు డిజైన్ చేసిన ప్రాజెక్టు రూపు దిద్దుకుంటుందని పేర్కొంది. మరోవైపు జలమండలి నూతన ప్రణాళికలు అమలు చేసేందుకు ఆదాయం పెంచడంపై దృష్టి సారించనుంది.