News October 31, 2025
HYD: ఉక్కు మనిషి వల్లే ఊపిరి పీల్చాం!

భారత ఏకత్వానికి ప్రతీకగా నిలిచారు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. 565 సంస్థానాలను ఒకే త్రివర్ణ పతాకం కింద సమీకరించిన మహనీయుడు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయడంలో ఆయన చూపిన ధైర్యం చరిత్రలో చెరిగిపోదు. ఆపరేషన్ పోలో ద్వారా నిజాంపాలనకు తెరదించారు. ఉక్కు మనిషి ఉక్కు సంకల్పం వల్లే ఊపిరి పీల్చామనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీరేమంటారు?
Similar News
News October 31, 2025
రేపు కడపకు రానున్న మాజీ ఉప రాష్ట్రపతి

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శనివారం కడపకు రానున్నారు. 2వ తేదీ కడప సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో జరిగే జానుమద్ది హనుమత్ శాస్త్రి శతజయంతి వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి కడప చేరుకుని రాత్రికి బస చేసి 2న ఉదయం జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం తిరిగి ఆయన చెన్నైకు విమానంలో బయలుదేరి వెళ్తారని అధికారులు వెల్లడించారు.
News October 31, 2025
జనగామ: ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలి!

ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్యబోధన అందించాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అన్నారు. విడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జనగామ నుంచి కలెక్టర్ రిజ్వాన్ భాషా పాల్గొన్నారు.
News October 31, 2025
ఘోరం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

చాక్లెట్ ఆశ చూపి నాలుగేళ్ల చిన్నారిపై ఇద్దరు అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు ఈ ఘోరానికి పాల్పడ్డారు. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు ఆమెను కాపాడి, నిందితులను పోలీసులకు అప్పగించారు. బాలికను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు.


