News July 19, 2024

HYD: ఉజ్జయినీ బోనాలు.. కీలక మార్పులు

image

ఈనెల 21న నిర్వహించనున్న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలకు అధికారులు కీలక మార్పులు చేశారు. ఈసారి ఆలయంలోకి జోగినీలు, శివసత్తులతో పాటు ఐదుగురినే అనుమతిస్తామని స్పష్టం చేశారు. అలాగే మధ్యాహ్నం 1:30 నుంచి సా.4 గంటలలోపు బాట కూడలి నుంచి మాత్రమే వచ్చేలా పక్కా ప్రణాళిక చేశారు. బోనాల అనంతరం నిర్వహించే ఫలారం బండి(తొట్టెల) ఊరేగింపు రాత్రి 12 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News August 26, 2025

RR: వేతనాలు అందక ఆదర్శ ఉపాధ్యాయుల అవస్థలు

image

తెలంగాణలోని ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది గత ఐదు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఇలా కఠినంగా వ్యవహరించడం ఎంతమాత్రం సరికాదని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

News August 25, 2025

ఉద్యమానికి పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ: సీఎం

image

ఉస్మానియా వర్సిటీ అనే పదం తెలంగాణకు ప్రత్యామ్నాయ పదమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓయూలో హాస్టల్ భవనాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఉస్మానియా వర్సిటీ, తెలంగాణ అవిభక్త కవలలు లాంటివని.. పీవీ నరసింహారావు, చెన్నారెడ్డి, జైపాల్‌రెడ్డి ఉస్మానియా వర్సిటీ నుంచి వచ్చిన వారేనన్నారు. తెలంగాణలో ఏదైనా సమస్య వచ్చిన ఉద్యమానికి పురిటిగడ్డ ఉస్మానియా వర్సిటీయేనని తెలిపారు.

News August 25, 2025

HYDలో వినిపిస్తున్న మాట ‘అన్నా.. గణేశ్ చందా’

image

మరో 2 రోజుల్లో వినాయకచవితి రానుంది. ఈ నేపథ్యంలో వీధుల్లో ఎత్తైన గణనాథుడి విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు యువకులు సన్నాహాలు చేస్తున్నారు. మండపాల ఏర్పాటు, అలంకరణ, పూజారిని నియమించడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. యువకులు, పిల్లలు ‘అన్నా.. అక్కా చందా ప్లీజ్’ అంటూ ఇళ్లకు క్యూ కడుతున్నారు. మరోవైపు కొంత మంది యువత వినూత్నంగా డప్పులతో చందా అడుగుతున్నారు.