News September 6, 2025

HYD: ఉత్తమ టీచర్‌గా స్నేహలత

image

మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ తరపున నిర్మాణ రంగంలో HYD NAC టీచర్ స్నేహలతను జాతీయ ఉత్తమ టీచర్ అవార్డు వరించింది. టీచర్స్ డే సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, జాతీయ ఉత్తమ టీచర్ అవార్డును ఆమెకు అందజేసి అభినందించారు. తనకు ఇంత గొప్ప గౌరవం దక్కటం గర్వంగా ఉందని స్నేహలత తెలిపారు.

Similar News

News September 6, 2025

భవన నిర్మాణాల అనుమతులతో GHMCకి భారీ లాభం

image

GHMC భవన నిర్మాణాలకు భారీగా అనుమతులు ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లో 4,389 నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి, రూ.759.98 కోట్ల ఆదాయం గడించింది. గతేడాది ఇదే సమయంలో వచ్చింది రూ.399.61 కోట్లు కాగా.. ఈసారి రూ.360.37 కోట్లు అదనంగా వచ్చింది. ఈ ఏడాది మొత్తం రూ.2 వేల కోట్ల ఆదాయం వస్తుందని GHMC అంచనా వేస్తోంది.

News September 6, 2025

విద్యారంగంలో సిద్దిపేటకు ఉత్తమ అవార్డు

image

విద్యారంగంలో ఓవరాల్‌గా ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాగా సిద్దిపేట ఎంపికైంది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ హైమావతి, డీఈవో శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. ఈ అవార్డు సాధించినందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు వారికి అభినందనలు తెలిపారు.

News September 6, 2025

SKLM: రేపు అటవీశాఖ ఉద్యోగ పరీక్ష

image

అటవీ శాఖలో పలు ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు SKLM రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఆదివారం పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. జిల్లాలో 10 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. పరిక్షలకు తగ్గా ఏర్పాట్లు చేశామన్నారు.