News February 27, 2025
HYD: ఉపాధ్యాయుడి వేధింపులు.. రిమాండ్

ప్రేమపేరుతో వేధిస్తున్న ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన ఆదిభట్ల PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. నాదర్‌గుల్‌లోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బాలికను ప్రేమపేరుతో వేధిస్తూ.. అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు ఆదిభట్ల PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు తరలించారు.
Similar News
News February 27, 2025
HYD: శివయ్యా.. కడుపు నింపావయ్యా..!

నిన్న మహా శివరాత్రిని పురస్కరించుకుని HYD శివనామస్మరణతో తరించింది. త్రేతాయుగంలో వానర సేన హనుమ, శ్రీ రాముడు ప్రతిష్ఠించిన కీసరలోని శివలింగం వద్ద అద్భుతం జరిగింది. భోళాశంకరుడికి భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని తిన్న వానరాలు.. వాటి కడుపునింపినందుకు ధన్యవాదాలు తెలుపుతూ శివయ్యను మొక్కుతున్నట్లు ఉన్న ఈ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. వాటి సేనాని, ఆరాధ్య దైవం ప్రతిష్ఠించిన లింగం వద్ద సందడి చేశాయి.
News February 27, 2025
HYD: అయ్యో ఎంత పనిచేశారు సారూ..!

పండగపూట లంగర్‌హౌస్ చెరువులో <<15590306>>తండ్రీ కొడుకులు<<>> మృతిచెందిన విషయం తెలిసిందే. వారు చనిపోవడానికి ముందు జరిగిన పరిణామాలు స్థానికులు చెబుతుంటే కలవరపెడుతున్నాయి. కొడుకును భుజాన ఎత్తుకుని మునిగిపోతూ అధికారులు, సిబ్బందిని రక్షించమని వేడుకున్నా.. వారు స్పందించకుండా సాయం కావాలని స్థానిక నాయకులకు ఫోన్ చేసి అడిగారని ప్రత్యక్షసాక్షులు వాపోయారు. వారు సాయం అందించుంటే ఇద్దరూ బతికుండేవారని బాధిత కుటుంబం రోదించింది.
News February 27, 2025
HYD: ఆ రోజులూ మళ్లీరావు..!

శివరాత్రికి శివుడిని ఎంత ఇష్టంగా కొలుస్తారో.. అంతే ఇష్టంగా జాగరణలో చేస్తారు. HYDలో అనేక చోట్ల యువత కోసం రాత్రంతా క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్లు ఏర్పాట్లు చేశారు. పెద్దలు స్వామి వారిని.. సంకీర్తనలు, భజనతో స్మరించుకుంటూ జాగరణ పూర్తి చేశారు. కానీ గతంలో మన ఊళ్లల్లో వేసే పద్య, పౌరాణిక, జానపద నాటకాలకు పెద్ద ఫ్యాన్ బేస్ ఉండేది. చిన్నతనంలో పదాలు అర్థం కాకపోయినా చూస్తూ కూర్చునేవాళ్లం. మీరెలా జాగరణ చేశారు.