News February 27, 2025

HYD: ఉపాధ్యాయుడి వేధింపులు.. రిమాండ్

image

ప్రేమపేరుతో వేధిస్తున్న ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన ఆదిభట్ల PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. నాదర్‌గుల్‌లోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బాలికను ప్రేమపేరుతో వేధిస్తూ.. అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు ఆదిభట్ల PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు తరలించారు.

Similar News

News December 15, 2025

లిక్కర్ స్కామ్ కేసు: SC విచారణ జనవరి 21కి వాయిదా

image

ఏపీ అక్రమ మద్యం కేసులో గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను SC విచారించింది. వారికి సరెండర్ నుంచి ఇచ్చిన మినహాయింపును జనవరి 21 వరకు పొడిగించి తదుపరి విచారణను అదే తేదీకి వాయిదా వేసింది. ఈమేరకు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. ట్రయల్ కోర్టు ఛార్జిషీట్‌ను కాగ్నిజెన్స్‌లోకి తీసుకునేందుకు తమ ఉత్తర్వులు అడ్డంకి కాబోవని స్పష్టం చేసింది.

News December 15, 2025

ములుగు: భార్య సర్పంచ్.. భర్త వార్డు మెంబర్..!

image

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ములుగు మండలం ఖాసీందేవిపేట సర్పంచ్‌గా వాంకుడోతు నిరోషా గెలిచారు. ఆమె భర్త అమర్ సింగ్ 6వ వార్డు నుంచి వార్డు సభ్యుడిగా విజయం సాధించారు. ఒకే పంచాయతీ కార్యవర్గంలో భార్య సర్పంచ్‌గా, భర్త వార్డు సభ్యుడిగా ఉండటంతో సర్వత్రా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అమర్ సింగ్ కాకతీయ విశ్వ విద్యాలయం నుంచి ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పొందారు.

News December 15, 2025

రేపు మచిలీపట్నంకు నారా లోకేశ్, పీవీఎన్ మాధవ్ రాక

image

మంత్రి లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ మంగళవారం మచిలీపట్నం రానున్నారు. స్థానిక న్యూ హౌసింగ్ బోర్డ్ రింగ్‌లో ఉమ్మడిగా ఏర్పాటు చేస్తున్న మాజీ ప్రధాని వాజ్ పేయి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కాంస్య విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో ఇరువురు నేతలు పాల్గొననున్నట్లు ఆయా పార్టీ వర్గాలు తెలిపాయి. ఇరువురి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.