News August 23, 2025
HYD: ఉర్దూ యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్

HYD మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నిర్వహించే కోర్సుల దరఖాస్తు గడువు సెప్టెంబర్ 17 వరకు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. 2025- 26 విద్యా సంవత్సరానికి డిస్టెన్స్ లర్నింగ్ అండర్ UG, PG, డిప్లమా సర్టిఫికెట్ కోర్సులకు కూడా అడ్మిషన్లు అక్టోబర్ 13 వరకు అందుబాటులో ఉంటాయన్నారు.
Similar News
News August 23, 2025
HYD: పీఏసీ సమావేశాలు ప్రారంభం.. సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వంపై హర్షం

HYD గాంధీభవన్‌లో పీఏసీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఓటు చోరీపై ప్రత్యేక ప్రచార లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పీఏసీ సభ్యులు పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎంపికపై హర్షం వ్యక్తం చేశారు.
News August 23, 2025
HYD: యూరియా సరఫరాపై మంత్రుల సమీక్ష

రాష్ట్రానికి యూరియా సరఫరాను పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని, BRS దుష్ప్రచారంతో రైతులు ఆందోళనకు గురికావొద్దని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం, వ్యవసాయ, పరిశ్రమల శాఖల ఉన్నతాధికారులతో శనివారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సీజన్‌లో 145 రోజుల్లో 40 రోజులు మాత్రమే ప్లాంట్ పనిచేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
News August 23, 2025
HYDలో గణనాథుడికి స్వాగతోత్సవాలు.. ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌లో గణనాథుడికి స్వాగతోత్సవాలు, ఆగమన్ వేడుకలను పిల్లలు, పెద్దలు కలిసి ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై వినాయక విగ్రహాన్ని తీసుకెళుతుండగా చెట్లు అడ్డుగా రావడంతో ట్రాఫిక్‌కు ఆటంకం ఏర్పడింది. గాంధీనగర్ ట్రాఫిక్ పీఎస్ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని ఉత్సవ కమిటీ నిర్వాహకులకు పోలీసులు సూచించారు.