News April 1, 2025
HYD ఊపిరి ఆగుతుందని స్లోగన్స్

HCUలో ప్రభుత్వ దామనకాండ అంటూ KBR పార్కు దగ్గర బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ‘ప్రకృతిని కాపాడండి.. అది మనల్ని కాపాడుతుంది. HCU అడవిని నరికితే.. హైదరాబాద్ ఊపిరి ఆగుతుంది’ అంటూ బీఆర్ఎస్వీ నాయకులు నినాదాలు చేశారు. ఈ నిరసనకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ప్రకృతి ప్రేమికులు, మద్దతు తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News October 28, 2025
HYD: హరీశ్‌రావు ఇంటికి KTR.. కార్యక్రమాలు రద్దు

హరీశ్‌రావు తండ్రి మరణించిన నేపథ్యంలో కేటీఆర్ ఆయన ఇంటికి బయలుదేరారు. పితృవియోగం కారణంగా ఈ రోజు జరగాల్సిన పార్టీ కార్యక్రమాలు, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. కోకాపేటలోని హరీశ్‌రావు ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నేతలు చేరుకున్నారు.
News October 28, 2025
శంషాబాద్: మద్యం దుకాణాల లక్కీ డ్రాలో పాల్గొన్న కలెక్టర్

శంషాబాద్ పట్టణంలోని మల్లికా కన్వెన్షన్‌లో జరిగిన మద్యం షాపుల లక్కీ డ్రా కార్యక్రమానికి కలెక్టర్ నారాయణరెడ్డి హాజరయ్యారు. 249 మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి లాటరీ పద్ధతి ద్వారా కేటాయించారు. సరూర్‌నగర్ యూనిట్‌లో 138 రిటైల్ మద్యం దుకాణాలు, శంషాబాద్ యూనిట్ పరిధిలో మొత్తం 111 రిటైల్ మద్యం దుకాణాలకు ఎంపిక జరిగింది.
News October 27, 2025
HYD: సిట్టింగ్ స్థానం కోసం BRS అడుగులు

జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు BRS అడుగులు వేస్తుంది. 3 పర్యాయాలు ప్రాతినిధ్యం వహిస్తున్న జూబ్లీహిల్స్ స్థానం ఎట్టి పరిస్థితిలో చేజారకుండా గట్టి ప్రయత్నాలకు దిగింది. పదేళ్లలో చేసిన అభివృద్ధి పనులు, సెంటిమెంట్‌ను నమ్ముకుని రంగంలోకి దిగింది. జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్ట నున్నారో వేచి చూడాల్సిందే.


