News November 22, 2024

HYD: ఎంఈ, ఎంటెక్‌ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ

image

HYD OU పరిధిలోని ఎంఈ, ఎంటెక్ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరిస్తున్నట్లు ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ కే.శశికాంత్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల రెండో సెమిస్టర్ మెయిన్, మొదటి, మూడో సెమిస్టర్ మేకప్ పరీక్షా ఫీజును సంబంధిత కళాశాలల్లో ఈ నెల 25వ తేదీ లోపు చెల్లించాలని అన్నారు. అపరాధ రుసుము రూ.500తో 28వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

Similar News

News November 22, 2024

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫార్మాసిస్టులు బాధ్యతతో పని చేయాలి: రాజనర్సింహ 

image

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫార్మసిస్టులు బాధ్యతతో పని చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శుక్రవారం సచివాలయంలో సెంట్రల్ మెడికల్ స్టోర్స్ బలోపేతంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కృత్రిమ మందుల కొరత పై చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాదికారులను ఆదేశించారు. హెల్త్ ఫెసిలిటీ పనితీరుపై సమీక్షలో చర్చించారు.

News November 22, 2024

HYD: ముగిసిన రాష్ట్రపతి పర్యటన

image

HYD మాదాపూర్‌లోని శిల్పారామం వేదికగా జరిగిన లోక్ మంథన్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు పాల్గొన్న విషయం తెలిసిందే. కాగా రాష్ట్రపతి హైదరాబాద్‌లో రెండు రోజుల పర్యటన ముగిసింది. రెండు రోజుల హైదరాబాద్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయంలో మంత్రి సీతక్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆమెకు వీడ్కోలు పలికారు.

News November 22, 2024

షాద్‌నగర్‌లో గుడిపై దాడి.. బీజేపీ ఫైర్

image

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని వివేకానంద కాలనీలో బసవన్న దేవాలయంలో దుండగులు శివలింగాన్ని ధ్వంసం చేయడంపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో అనేక దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.