News April 6, 2025
HYD: ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళల రక్షణ కోసం వాట్సప్ గ్రూప్

ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళల రక్షణకు ఆర్పీఎఫ్ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఓ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఏ రైలులో ఎవరు డ్యూటీలో ఉన్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా మహిళా కోచ్‌లలో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారనే విషయంపై దృష్టి సారిస్తున్నారు. ఎప్పటికప్పుడు వాట్సప్లో ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.
Similar News
News April 8, 2025
దాది రతన్ మృతి పట్ల సీఎం సంతాపం

బ్రహ్మకుమారీల దాది రతన్ మోహిని జీ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. దాది మోహిని గ్లోబల్ సెంటర్ల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అని, దాది జీవితం ఆదర్శప్రాయమన్నారు. దాది మృతి రాష్ట్ర, దేశ, విశ్వ ఆధ్యాత్మికతకు తీరనిలోటని సీఎం పేర్కొన్నారు.
News April 8, 2025
HYD: AI అంటే అనుముల ఇంటలిజెన్స్: కవిత

అసెంబ్లీ ఆవరణలో ఫులే విగ్రహ ఏర్పాటుపై ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదని.. అనుముల ఇంటలిజెన్స్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో రాష్ట్రానికి ప్రమాదం లేదని, అనుముల ఇంటలిజెన్స్‌తో ప్రమాదం ఉందన్నారు. అది రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తుందని, దాన్ని పక్కకు జరిపితే తప్ప రాష్ట్రం బాగుపడదన్నారు.
News April 8, 2025
మైనర్ డ్రైవింగ్‌పై HYD పోలీసుల ప్రత్యేక డ్రైవ్

HYDలో సోమవారం మైనర్ డ్రైవింగ్ లపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సైదులు మాట్లాడుతూ.. చాలా ప్రమాదాలు డ్రైవింగ్‌పై అవగాహన లేకుండా, లైసెన్సు లేని మైనర్లు నడపడం వల్లనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రత్యేక తనిఖీల ద్వారా మైనర్లు నడిపిన వాహనాలు గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామన్నారు. వాహనాలను ఇచ్చిన వారిపై కూడా చర్యలు ఉంటాయన్నారు.