News August 23, 2024
HYD: ఎంపాక్స్ ఎఫెక్ట్.. గాంధీలో ప్రత్యేక వార్డులు

ప్రపంచవ్యాప్తంగా ఎంపాక్స్ (మంకీపాక్స్) అలజడి రేకెత్తిస్తున్న నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రులను సిద్ధం చేసింది. అక్కడ ప్రత్యేక వార్డులు నెలకొల్పింది. గాంధీలో 20 పడకలు కేటాయించారు. ఇందులో పురుషులకు, మహిళలకు పదేసి పడకలు కేటాయించినట్లు గాంధీ వైద్యులు పేర్కొన్నారు. ఫీవర్ ఆసుపత్రిలో ఆరు పడకలు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు.
Similar News
News February 27, 2026
HYD: మామూళ్ల మోజులో అధికారులు.. మెమోలు..!

శివారు కాలనీల్లో నీటికోసం జనం తపిస్తుంటే అధికారులు మాత్రం ట్యాంకర్ మాఫియాతో చేతులు కలిపారు. కావాలనే పైపులైన్లలో ప్రెజర్ తగ్గించి ప్రైవేట్ ట్యాంకర్లకు కొమ్ము కాస్తున్నారు. ప్రభుత్వ ఫిల్లింగ్ పాయింట్ల వద్దే తక్కువ ధరకు నీటిని నింపుకొని బయట రూ.2000 వరకు అమ్ముతూ సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. ఈ దందాలో కిందిస్థాయి నుంచి పైదాకా వాటాలు వెళ్తున్నాయని తేలడంతో కొందరు అధికారులకు మెమోలు జారీ అయ్యాయి.
News February 27, 2026
HYD: జరిగింది సరే.. ఎవరు బాధ్యత వహిస్తారు..?

దాదాపు 30% డిజిటల్ మీటర్లు పనిచేయడం లేదని స్వయంగా హైదరాబాద్ మహానగర జలమండలి అధికారులే క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించారు. మీటర్లు రీడింగ్ చూపించకపోవడం వల్ల వినియోగదారులకు ‘లాక్డ్ రీడింగ్’ (Locked Reading) పడటం లేదు. దీంతో వచ్చే అదనపు ఆదాయం బోర్డుకు వెళ్తున్నా, మీటర్ల కొనుగోళ్లలో జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు..?
News February 27, 2026
HYD: రూల్స్ జానతా నై.. ‘సిండికేట్’గా నొక్కేశారు..!

హైదరాబాద్ మహానగర జలమండలి అంతర్గత ఆడిట్ విభాగం <<19251869>>రూ.450 కోట్ల<<>> వ్యయంలో జరిగిన తేడాలను గుర్తించింది. ముఖ్యంగా మీటర్ల కొనుగోలులో టెండర్ నిబంధనలను ఒక నిర్దిష్ట కంపెనీకి అనుకూలంగా మార్చినట్లు (Tailor Made Conditions) తేలింది. నిబంధనల ప్రకారం కనీసం మూడు కంపెనీలు పోటీ పడాలి, కానీ ఇక్కడ ‘సిండికేట్’గా ఏర్పడి రూల్స్‌ను గాలికొదిలేశారు.


