News January 19, 2026

HYD: ఎక్కడ పడితే అక్కడ సిమ్‌లు కొంటున్నారా?

image

సిమ్ కార్డులు విక్రయిస్తున్న అంతరాష్ట్ర నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లాకు చెందిన దినేష్, సాయిప్రదీప్ నిబంధనలకు విరుద్ధంగా సిమ్ కార్డులను అమ్ముతూ మోసాలు చేస్తున్నారు. సిమ్ కోసం వచ్చిన వారి వేలిముద్రలతో మరికొన్ని సిమ్‌లు యాక్టివేట్ చేసుకుని డ్రగ్స్ ముఠాలు, సైబర్ నేరస్థుకు అమ్ముతున్నారు. దీంతో సీసీఎస్ స్పెషల్ టీమ్ వీరిని అదుపులోకి తీసుకొని 184 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News February 10, 2026

HYD: మూసీ తీరాన ‘దోమల’ ఘోష!

image

మూసీ ప్రక్షాళన సంగతేమో కానీ.. దోమల సంతతి మాత్రం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. 2024లో మూసీ పరీవాహక ప్రాంతాల్లో 450 మలేరియా కేసులు నమోదవ్వగా 2025 ముగిసేసరికి ఆ సంఖ్య 700 దాటేసింది. అధికారులు డ్రోన్లతో మందులు చల్లుతున్నామని చెబుతున్నా గుర్రపుడెక్క ముందు అవేవీ పనిచేయడం లేదు. సాయంత్రం 6 దాటిందంటే చాలు కిటికీలు తెరిస్తే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. ఏటా రూ.కోట్లు ఖర్చు పెడుతున్నా దోమలు తగ్గడం లేదు.

News February 10, 2026

HYD: కొత్త కమిషనరేట్లు.. వీరే బాధ్యులు..!

image

* కమిషనర్ కర్ణన్ టీంలో అనురాగ్ జయంతి, ప్రియాంక ZCలుగా అందుబాటులో ఉంటారు. మీ ఏరియాలో ఎలాంటి సమస్యలున్నా 7993425555కు కాంటాక్ట్ అవ్వొచ్చు.
* వినయ్ కృష్ణారెడ్డి టీంలో ZCలుగా సాంచిత్ గంగ్వార్, రాధికా గుప్తా వ్యవహరిస్తారు. మీ ఏరియాలో ఎలాంటి సమస్యలున్నా 9063421145కు కాల్ చేయొచ్చు.
* సృజన టీంలో భోకాడే హేమంత్, అపూర్వ్ చౌహాన్, సందీప్ కుమార్ ZCలుగా ఉంటారు. ఎలాంటి సమస్యలున్నా 8008011110కు కాంటాక్ట్ కావచ్చు.

News February 10, 2026

HYD: నయా కమిషనరేట్లు.. వీరి చేతుల్లో ఈ జోన్లు!

image

* కర్ణన్-LBనగర్, శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్ల పరిధి ఈయనదే.
* వినయ్ కృష్ణారెడ్డి-మల్కాజిగిరి, ఉప్పల్ జోన్లలోని కీసర, అల్వాల్, బోయిన్‌పల్లి, మౌలాలి, మల్కాజిగిరి, ఘట్‌కేసర్, కాప్రా, నాచారం, ఉప్పల్, బోడుప్పల్ బాధ్యతలు ఈయనకే.
* సృజన-శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లలోని గచ్చిబౌలి, మాదాపూర్, నిజాంపేట్, జీడిమెట్ల సహా 16సర్కిళ్ల బాధ్యత ఈమెదే.