News May 12, 2024
HYD: ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు: సీపీ

శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. HYD నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, డబ్బు, మద్యం అక్రమ రవాణాను అడ్డుకుంటామన్నారు. ఇప్పటి వరకు రూ.2 కోట్లు స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారులకు అందించామని పేర్కొన్నారు.
Similar News
News February 8, 2026
HYD: రేపు జయశంకర్ అగ్రీ వర్సిటీ స్నాతకోత్సవం

ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మెగా స్నాతకోత్సవం రేపు నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి ప్రొ.అల్దాస్ జానయ్య తెలిపారు. ముడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్నాతకోత్సవాలను ఒకేసారి వర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం కులపతి జిష్ణుదేవ్ వర్మ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ వ్యవసాయ రంగ నిపుణులు ప్రభు పింగళి హాజరుకానున్నట్లు తెలిపారు.
News February 4, 2026
రంగారెడ్డి జిల్లా DEOపై ACBకి ఫిర్యాదు!

రంగారెడ్డి జిల్లా DEO సుశీందర్రావు ఆస్తిపాస్తుల, ఆదాయ వ్యయాలపై వెంటనే పూర్తి సమగ్ర విచారణ చేయాలని తెలంగాణ BC సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ ACBకి ఫిర్యాదు చేశారు. అలాగే జిల్లాలోని అందరూ MEOలు, DEO ఆఫీసులో డిప్యూటేషన్‌పై పని చేస్తున్న బాదం వెంకటేశ్, లక్ష్మీనరసింహులు ఆస్తులపైనా సమగ్ర విచారణ చేయాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
News February 4, 2026
మహిళా పారిశ్రామికవేత్తలకు డిజిటల్ సాధికారత

GHMC, MEPMA- ISB సంయుక్త ఆధ్వర్యంలో మహిళా సూక్ష్మ పారిశ్రామిక వేత్తలకు డిజిటలైజేషన్, వ్యాపార సామర్థ్య పెంపుపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 400 మంది మహిళలకు వాట్సాప్ బిజినెస్, ఇన్స్టాగ్రామ్ స్టోర్‌ఫ్రంట్స్, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. సూక్ష్మ రుణాల లభ్యత, మార్కెటింగ్ మెళకువలతో మహిళా స్వయం ఉపాధి రంగాలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.


