News October 27, 2025

HYD: ఎన్నికల ఖర్చులు తనిఖీ చేయనున్న అధికారులు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు తమ ఖర్చులు నమోదుచేసే రిజిస్టర్లను అధికారులు రేపు తనిఖీ చేయనున్నారు. పోటీలో ఉన్న 58 మంది అభ్యర్థులు తప్పని సరిగా చెక్ చేయించుకోవాలని ఎన్నికల పరిశీలకుడు సంజీవ్ కుమార్ లాల్ తెలిపారు. రేపటితోపాటు మరో 2 పర్యాయాలు (నవంబర్ 3, 9) రిజిస్టర్లను తనిఖీ చేస్తామని పేర్కొన్నారు.

Similar News

News October 27, 2025

HYD: డీప్‌ఫేక్ కేసులో విచారిస్తున్నాం: సీపీ

image

మెగాస్టార్ చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు సృష్టించడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు మెగాస్టార్ చిరంజీవి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ స్పందిస్తూ.. చిరంజీవి డీప్‌ఫేక్ కేసులో విచారణ చేస్తున్నామని, సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసే కేటుగాళ్లపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి విచారణ చేస్తామన్నారు.

News October 27, 2025

DRC వద్ద మూడంచెల భద్రత.. ఎలా అంటే?

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో DRC సెంటర్ వద్ద ఎన్నికల అధికారులు మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. మెయిన్‌గేటు వద్ద కొందరిని, రెండోగేటు వద్ద ఇంకొందరిని, స్టేడియం లోపల ఇంకొందరిని భద్రత కోసం వినియోగిస్తారు. ఇందుకోసం ముగ్గురు ఏసీపీలు, ఏడుగురు ఇన్‌స్పెక్టర్లతోపాటు ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు ఉంటారు. వీరితోపాటు సాయుధ బలగాలు ఉంటాయి.

News October 27, 2025

భారం నీదేనయా.. కిషన్‌రెడ్డినే నమ్ముకున్న కాషాయదళం

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ ప్రచారం జోరుగా సాగిస్తోంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గం కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహించే సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉండటంతో అభ్యర్థి గెలుపు బాధ్యత కేంద్రమంత్రి, స్థానిక ఎంపీ కిషన్ రెడ్డిపైనే పడింది. దీంతో జూబ్లీహిల్స్ సీటు కమలం ఖాతాలో వేయాలని కిషన్‌రెడ్డి భావిస్తున్నారు. ఆయన నేతృత్వంలోనే ఇక్కడి ప్రచారం జోరుగా సాగుతోంది.