News November 7, 2025
HYD: ఎన్నికల సమయంలో సోదాలు సహజం: పొన్నం

ఎన్నికల సమయంలో సోదాలు జరగడం సహజమని, అవి ఎవరి ఇంట్లో అయినా చేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్నికల సంఘం పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్ పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు సోదాలు నిర్వహించడం ఎన్నికల సంఘం హక్కని, ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదని మంత్రి స్పష్టం చేశారు.
Similar News
News November 7, 2025
జీపీఎస్ స్పూఫింగ్ అంటే?

GPS స్పూఫింగ్ అనేది ఒక సైబర్ అటాక్. GPS సిగ్నల్‌లను మానిప్యులేట్ చేసి నావిగేషన్ వ్యవస్థలను తప్పుదారి పట్టిస్తారు. ఇలా ఫేక్ శాటిలైట్ సిగ్నల్‌లను ప్రసారం చేయడంతో విమానాలు ఫాల్స్ రూట్లలో వెళ్లే అవకాశముంది. ఓ చోట ఉన్న ఫ్లైట్ మరో చోట ఉన్నట్లు చూపిస్తుంది. దీని వల్ల ఫ్లైట్స్ టేకాఫ్/ల్యాండింగ్ అయ్యేటప్పుడూ ప్రమాదాలకు ఆస్కారముంటుంది. <<18227103>>ఢిల్లీ<<>>, ముంబైలో విమాన సేవల అంతరాయానికి ఇదే కారణమనే అనుమానాలున్నాయి.
News November 7, 2025
ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి కొత్త ఊపు.!

రాజధాని నిర్మాణానికి రూ. 7,500 కోట్ల రుణం అందించేందుకు నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. రుణం మంజూరుకు సంబంధించిన పత్రాలను శుక్రవారం అమరావతిలో CM చంద్రబాబు, మంత్రి నారాయణ సమక్షంలో CRDA కమిషనర్ కన్నబాబుకు అందజేశారు. కార్యక్రమంలో NABFID డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సామ్యూల్ జోసెఫ్, తదితరులు పాల్గొన్నారు.
News November 7, 2025
ప్రేమికుడిపై కక్షతో ఫేక్ మెయిల్స్… చివరకు జైలు

ప్రేమ విఫలమైన ఓ యువతి ప్రేమికుడి పేరిట ఫేక్ బాంబు బెదిరింపు మెయిల్స్ పంపి కటకటాల పాలైంది. రోబోటిక్ ఇంజినీర్ రెనా జోషిల్డా(గుజరాత్) ప్రభాకర్ అనే సహచరుడిని ప్రేమించింది. అయితే ఆయన మరో పెళ్లి చేసుకోగా కక్షగట్టింది. ఆయన వర్చువల్ నంబర్‌తో అనేక రాష్ట్రాల స్కూళ్లు, కోర్టులు, స్టేడియాల్ని పేల్చేస్తున్నట్లు రెనా మెయిల్స్ పంపింది. 21 ప్రాంతాల్లో పోలీసులను పరుగులు పెట్టించి చివరకు బెంగళూరులో అరెస్టైంది.


