News December 3, 2024

HYD: ఎమ్మెల్సీతో మరో ఎమ్మెల్సీ భేటీ

image

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితను పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. HYDలో ఎమ్మెల్సీ కవితను కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఉమ్మడి పాలమూరు నియోజకవర్గ ప్రజల సమస్యలను తనదైన శైలిలో తీర్చుకుంటూ ముందుకు వెళ్తున్న ఆయనని.. ఎమ్మెల్సీ కవిత అభినందించారు. అనంతరం పార్టీ విషయాలు, ప్రజా సమస్యలను పరస్పరం చర్చించుకున్నారు.

Similar News

News April 5, 2026

రంగారెడ్డి: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత శిక్షణ!

image

రంగారెడ్డి జిల్లా గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించేందుకు SBI RSETI సువర్ణావకాశం కల్పిస్తోంది. టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో ఏప్రిల్ 13 నుంచి 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. 19 నుంచి 50 ఏళ్ల మధ్య గల మహిళలు దీనికి అర్హులు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతితో పాటు కోర్సు పూర్తయ్యాక ఉచితంగా టూల్‌కిట్ అందిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు 7981951167, 9963562266 నంబర్లలో సంప్రదించాలన్నారు.

News April 4, 2026

రాజేంద్రనగర్‌లో హైకోర్టు భవనానికి శంకుస్థాపన

image

రాజేంద్రనగర్‌లో తెలంగాణ హైకోర్టు జోన్-II భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ పాల్గొన్నారు. రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి ఆయనకి గణస్వాగతం పలికారు. CS కె.రామకృష్ణారావు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ తదితరులు ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చారు.

News April 4, 2026

సరూర్‌నగర్: 7న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు

image

రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 7న జిల్లా స్థాయి ఫెడరేషన్ కప్ పోటీలు నిర్వహించనున్నారు. స్థానిక సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ పోటీల వివరాలను సంఘం కార్యదర్శి గోపి వెల్లడించారు. 16 ఏళ్లు పైబడిన వారు, అలాగే అండర్-20 పురుషులు, మహిళా విభాగాల్లో ఈ క్రీడలు ఉంటాయని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.