News November 7, 2025

HYD: ఎమ్మెల్సీ ఫోన్ హ్యాక్.. పోలీసులకు ఫిర్యాదు

image

MLC శంభీపూర్ రాజు ఫోన్‌ను దుండగులు హ్యాక్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. వ్యక్తిగత, అధికారిక సమాచారం భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, దుండిగల్ పోలీస్ స్టేషన్‌తో పాటు గచ్చిబౌలి సైబరాబాద్ కమిషనరేట్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. హ్యాకింగ్‌పై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Similar News

News April 14, 2026

మూసీ ప్రక్షాళనకు అడుగులు.. DPR కోసం టెండర్ల ఆహ్వానం

image

మూసీ నదికి పునర్జీవం పోసేందుకు కసరత్తు మొదలైంది. బాపూఘాట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు గౌరెల్లి వరకు 34 కిలోమీటర్ల మేర నాలా సీవర్ మళ్లించి, శుద్ధి చేసేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం DPR తయారీకి MRDCL టెండర్లను ఆహ్వానించింది. గతంలో HMWSSB రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను లోతుగా సమీక్షించి, ఎక్కడైనా లోపాలు లేదా పునరావృత అంశాలు ఉన్నాయో? లేదో? కన్సల్టెంట్ సంస్థ గుర్తించాల్సి ఉంటుంది.

News April 14, 2026

కోర్టుల్లో బెంచ్‌ల గురించి తెలుసా?

image

సుప్రీంకోర్టులో డివిజన్ బెంచ్, కాన్‌స్టిట్యూషన్ బెంచ్, లార్జర్ బెంచ్, త్రీ జడ్జి బెంచ్‌లు ఉంటాయి. డివిజన్ బెంచ్‌లో ఇద్దరు న్యాయమూర్తులు ఉంటారు. స్పెషల్ లీవ్ పిటిషన్లు, సివిల్, క్రిమినల్ అప్పీళ్లను విచారిస్తారు. కాన్‌స్టిట్యూషన్ బెంచ్‌లో కనీసం ఐదుగురు జడ్జిలు ఉంటారు. ఇది శాశ్వతం కాదు. కేసు తీవ్రతను బట్టి CJI ఏర్పాటు చేస్తారు. హైకోర్టుల్లో సింగిల్, డివిజన్, ఫుల్, లార్జర్ బెంచ్‌లు ఉంటాయి.

News April 14, 2026

సిరిసిల్ల: అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్‌ ఆవిష్కరించిన కలెక్టర్

image

జిల్లాలో ఈనెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో (ఐడీఓసీ) సంబంధిత అధికారులతో కలిసి ఉత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అగ్నిమాపక సిబ్బంది స్మారకార్థం ఏటా ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, వారం రోజుల పాటు ప్రజలకు అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.