News March 1, 2025

HYD: ఎల్బీనగర్‌లో ట్రాన్స్‌జెండర్ల పొదుపు సంఘం..!

image

HYDలో ట్రాన్స్‌జెండర్లు తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తూ ముందుకు వెళ్తున్నారు. తమ ప్రతిభను చాటి చెబుతూనే పలు రంగాల్లో రాణిస్తున్నారు. ఇటీవలే ట్రాఫిక్ ఉద్యోగాలకు సైతం వారిని ప్రభుత్వం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా.. GHMC & MEPMA సహకారంతో, అర్ధనారి ట్రాన్స్‌జెండర్ల పొదుపు సంఘం HYD ఎల్బీనగర్‌లో ఏర్పాటు జరగగా వారందరూ సంతోషం వ్యక్తం చేశారు.

Similar News

News March 1, 2025

బెల్లంపల్లి: హత్యాయత్నం కేసులో నలుగురి రిమాండ్

image

2 రోజుల క్రితం జరిగిన హత్యాయత్నం కేసులో నలుగురు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు బెల్లంపల్లి రూరల్ CI అబ్జలుద్దీన్ తెలిపారు. చర్లపల్లి జంకాపూర్‌కు చెందిన మహేందర్‌పై సన్నీ, బానేశ్, ఆదిత్య, సాయి కత్తితో దాడి చేశారు. మొక్క జొన్న అమ్మకానికి గుడిసే ఏర్పాటు చేయకూడదని అతడిపై దాడి చేశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.

News March 1, 2025

కొత్తగూడెం: ‘వారి ప్రాణత్యాగాల ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ’

image

ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అమరులైన మాదిగ ఉద్యమ నాయకులను స్మరించుకుంటూ శనివారం కొత్తగూడెం పట్టణ కేంద్రంలో వారికి పూలతో ఘన నివాళులు అర్పించారు. అమరులైన వారి ప్రాణ త్యాగాల ఫలితంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నామని తెలంగాణ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు సలిగంటి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో సుమంత్, పవన్, శ్రీనివాస్, అజయ్, చరణ్, చందు, సాయికుమార్, కిషోర్, అనిల్, భరత్, రాకేశ్ పాల్గొన్నారు.

News March 1, 2025

పాల్వంచ: సదరం కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..

image

ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు కోసం యూడీఐడీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ తెలిపారు. శనివారం సదరం క్యాంపులు, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఆర్ఎంవో రమేశ్‌తో సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

error: Content is protected !!