News April 6, 2024

HYD: ఎవరిని ఎవరు తొక్కుతారో చూద్దాం: మంత్రి 

image

మాజీ సీఎం KCR వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. శనివారం HYD గాంధీభవన్‌లో మంత్రి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో రచ్చ చేస్తామని కేసీఆర్ అంటున్నారు. రేపటి నుంచి కాంగ్రెస్ నేతలంతా రోడ్లపైనే ఉంటారు. ఎవరు వస్తారో రండి, చూసుకుందాం. ఎవరిని ఎవరు తొక్కుతారో తేలుతుంది. చేనేత కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదు’ అని విమర్శించారు. BRS పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. 

Similar News

News December 24, 2024

HYD: మైనర్లు వాహనాలు నడపొద్దు: ఎంపీ ఒవైసీ

image

మైనర్లు బైకర్స్, కార్లు నడపడం తగదని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకునేందుకు HYD బండ్లగూడలోని ఆర్టీఏ కార్యాలయానికి మంగళవారం ఒవైసీ వచ్చారు. ఈ సందర్భంగా రెన్యువల్‌కు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసిన అనంతరం ఒవైసీ మీడియాతో మాట్లాడారు. మైనర్లు వాహనాలు నడపడం తగదని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

News December 24, 2024

BREAKING: అశోక్‌ నగర్‌లో గ్రూప్-2 అభ్యర్థి సురేఖ ఆత్మహత్య

image

HYD అశోక్ నగర్‌లోని హాస్టల్‌లో ఉంటూ గ్రూప్-2, రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న గుగులోతు సురేఖ(22) ఆత్మహత్య చేసుకుంది. ఆమె బంధువులు తెలిపిన వివరాలు.. కామారెడ్డి(D) గాంధారి(M) సోమారం తండాకు చెందిన సురేఖకు నిజామాబాద్‌కు చెందిన అబ్బాయితో గత నెలలో ఎంగేజ్మెంట్ అయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న పెళ్లి కూడా నిశ్చయమైంది. కుటుంబ సమస్యలతో నిన్న సూసైడ్ చేసుకోగా గాంధీ ఆస్పత్రిలో ఈరోజు పోస్ట్‌మార్టం జరిగింది.

News December 24, 2024

HYD: మీ ప్రాంతంలో వీధి కుక్కల బెడద ఉందా?

image

జీహెచ్‌ఎంసీలో కుక్కల బెడదను తగ్గించేందుకు వెటర్నరీ విభాగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 332వీధి కుక్కలను పట్టుకున్నారు. వాటికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్‌లు వేసినట్లు వెటర్నరీ అధికారులు వెల్లడించారు. AWBI నిబంధనల ప్రకారం 189వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేశారు. వీధికుక్కల వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని GHMC పేర్కొంది. మీప్రాంతంలో కుక్కలున్నాయా కామెంట్ చేయండి.