News March 26, 2024
HYD: ఎవరీ శ్రీనివాస్ యాదవ్..?

BRS HYD ఎంపీ అభ్యర్థిగా స్థిరాస్తి వ్యాపారి, హైందవీ కాలేజీల ఛైర్మన్ శ్రీనివాస్ యాదవ్‌ను KCR ప్రకటించిన విషయం తెలిసిందే. 56ఏళ్ల వయసు గల ఆయన గోషామహల్‌లో ఉంటున్నారు. బీకామ్ చదివిన శ్రీనివాస్ 1989లో NSUI ఓయూ ఇన్‌ఛార్జి, NSUI నగర, రాష్ట్ర, జాతీయ కార్యదర్శిగా, 2006-2011వరకు ఉమ్మడి AP గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా పనిచేశారు. 2015 నుంచి BRSలో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన 2018, 2023లో గోషామహల్ టికెట్ ఆశించారు.
Similar News
News March 7, 2026
HYD: అక్రమార్కుల ఆకలికి ‘కూలీ’ల బతుకు తెల్లారింది!

టోలిచౌకిలో బిల్డింగ్ గోవా కూలీ ఇద్దరు కూలీలు చనిపోయిన ఘటన సిటీలో కలకలం రేపింది. కేవలం 3 అంతస్తులకే పర్మిషన్ ఉంటే, 6వ అంతస్తు వరకు స్లాబ్‌లు వేశారు. DECలోనే నోటీసులిచ్చామని ఆఫీసర్లు బుకాయిస్తున్నారు. ఇస్తే పని ఎలా సాగింది? మామూళ్ల మత్తులో ఉన్నారా? అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ప్లానింగ్ విభాగంలోని కొందరు అధికారుల అండదండలతోనే అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
News March 7, 2026
తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

TPCC మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ నియామితలయ్యారు. అధ్యక్షురాలిగా పార్టీ చీఫ్ ఖర్గే ఆమోదించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఆమె కాంగ్రెస్‌లో 45 ఏళ్లుగా ఉన్నారు. 1991లో PACS ఛైర్‌పర్సన్‌గా తొలిసారి ఎన్నికవ్వగా 2005లో వరంగల్ నగర మేయర్‌గా పని చేశారు. వరంగల్ పశ్చిమ నుంచి MLAగా పోటీ చేసి ఓటమి చెందారు. 2023-25 వరకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా పని చేశారు.
News March 7, 2026
HYD: మేడం సార్.. మేడం అంతే!

షాద్‌నగర్‌కి చెందిన ఇంద్రార్చిత కర్ణాటక క్యాడర్‌లో సివిల్స్‌లో 627వ ర్యాంకు సాధించి సత్తాచాటారు. ఆమె ప్రాథమికోన్నత విద్య షాద్‌నగర్‌లో పూర్తిచేశారు. HYDలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఆఫ్ ఉమెన్‌లో ఇంటర్, డిగ్రీ వరకు చదివారు. అనంతరం ఇగ్నో యూనివర్సిటీలో MA పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి.. ఢిల్లీకి వెళ్లి కోచింగ్ తీసుకొని సివిల్స్‌కు సిద్ధమయ్యారు. నిన్న విడుదలైన ఫలితాల్లో ‘మేడం’ గ్రేట్ అనిపించుకున్నారు.


