News August 28, 2025

HYD: ఎవరూ చూడటంలేదని తోక జాడించకండి..!

image

గణేశ్ నవరాత్రుల సందర్భంగా మండపాలు, నిమజ్జనవేడుకల్లో యువతులు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే పోకిరీల పని పట్టేందుకు SHE టీమ్స్ సిద్ధమైంది. మూడు కమిషనరేట్ల పరిధిలో అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా పోకిరీలపై నిఘా వేశారు. ఎవరూ చూడటం లేదని తోకజాడించాలని చూస్తే వారి కదలికలన్నీ పసిగడతాం అని స్పష్టం చేశారు. ఎక్కడైనా పోకిరీలు ఇబ్బంది పెడితే 94906 17444, 949061655, 8712662111 నెంబర్లకు కాల్ చేయాలన్నారు. 

Similar News

News August 28, 2025

హైదరాబాద్‌లో 1.40 లక్షల గణనాథుడి ప్రతిమలు

image

మహానగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బస్తీ, కాలనీ, గల్లీ తేడా లేకుండా నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మండపాల్లో గణనాథుడు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నాడు. నగర వ్యాప్తంగా 1.40 లక్షల విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు అధికారుల అంచనా. నిమజ్జనం జరిగే వరకు ప్రత్యేక కార్యక్రమాలు, అన్నదానాలు ఏర్పాటు చేసి నవరాత్రులను ఘనంగా జరుపుకోనున్నారు. శుక్రవారం నుంచి నిమజ్జనాల హడావుడి షురూ అవుతుంది.

News August 28, 2025

భారీ వర్షాలు: HYD- ఆదిలాబాద్ వయా కరీంనగర్ రూట్ మ్యాప్

image

భారీ వర్షాలతో NH- 44 నాగ్‌పూర్ హైవే దెబ్బతింది. ప్రజల భద్రత కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డైవర్షన్ అమలు చేశారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న లారీలు మెడ్చల్ చెక్‌పోస్ట్ సిద్ధిపేట- కరీంనగర్ – కోరుట్ల – మెట్‌పల్లి- ఆర్మూర్- ఆదిలాబాద్ వెళ్లాలని సూచించారు. కార్లు తూప్రాన్- సిద్ధిపేట- జగిత్యాల- కోరుట్ల- మెట్‌పల్లి- ఆర్మూర్- ఆదిలాబాద్ వైపు వెళ్లాలన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని తెలిపారు.

News August 28, 2025

HYD: గుర్తుంచుకోండి.. ఈ శనివారమే కౌన్సెలింగ్

image

రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ శనివారం 30న మిగిలిపోయిన సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. NRI కోటాలో అగ్రి ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ(బీటెక్), బీఎస్సీ అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో సీట్లు మిగిలిపోవడంతో ఈ స్పెషల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఉ.10 గంటలకు హాజరుకావాలని రిజిస్ట్రార్ విద్యాసాగర్ తెలిపారు. వివరాలకు pjtau.edu.in చూడాలన్నారు.