News October 12, 2025

HYD: ఏఐజీ ఘటనపై ఆసుపత్రి నిర్వాహకుల వివరణ

image

గచ్చిబౌలిలోని AIGలో జరిగిన ఘటనపై ఆసుపత్రి నిర్వాహకులు వివరణ ఇచ్చారు. లివర్ వ్యాధితో మురళీధర్ ఆస్పత్రిలో చేరాడని, డోనర్స్ ముందుకు రాకపోవడంతో ఆపరేషన్ ఆలస్యమైందన్నారు. కుటుంబసభ్యుల అంగీకారంతో ఆపరేషన్ నిర్వహించామని, అనంతరం ఆరోగ్యం మళ్లీ విషమించడంతో ICUకి షిఫ్ట్ చేశామన్నారు. ఇదే సమయంలో కుటుంబసభ్యులు మరో ఆస్పత్రికి తీసుకెళ్తామంటే డిశ్చార్జ్ చేశామని, అతడు చనిపోయే ప్రమాదం ఉందని చెప్పినా వినలేదన్నారు.

Similar News

News October 12, 2025

కరీంనగర్: యథావిధిగా ప్రజావాణి

image

ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా సోమవారం నుంచి కొనసాగించనున్నట్లు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రజలు ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో ప్రజావాణి కార్యక్రమం యాథావిధిగా కొనసాగుతుందన్నారు.

News October 12, 2025

రేపు యథావిధిగా PGRS: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)ను సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జి. లక్ష్మీశ ఆదివారం ప్రకటించారు. విజయవాడ కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి ప్రజల వద్ద ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు చెప్పారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల స్థాయిల్లో అధికారులు అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News October 12, 2025

భక్తుల విశ్వాసాలకు అనుగుణంగనే అభివృద్ధి పనులు: ఆది

image

రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు భక్తుల విశ్వాసాలు, మనోభావాలకు అనుగుణంగా చేపడతామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆదివారం ఆలయ ఆవరణలోని గెస్ట్ హౌస్‌లో ఆయన మాట్లాడారు. శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి, వాస్తు పండితులు, అర్చకులు, పట్టణ ప్రముఖుల సలహాలు, సూచనల మేరకే ఈ పనులకు శ్రీకారం చుట్టామన్నారు.