News March 27, 2025

HYD: ఏటా పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్!

image

ఏటా రొమ్ము, గర్భాశయ సర్వైకల్ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. HYDలోని MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో 2021లో 1240 రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదు కాగా.. 2024లో 1791 మంది బాధితులు దీని బారిన పడ్డారు. అదే 2021లో సర్వైకల్ క్యాన్సర్ కేసులు 1033 నమోదు కాగా.. 2024లో వాటి సంఖ్య 1262కు చేరింది. MNJ ఆస్పత్రి విస్తరించి కొత్త భవనంలోనూ క్యాన్సర్ చికిత్స అందిస్తున్నారు.

Similar News

News December 12, 2025

NLR: ఒకే చీరకు ఉరేసుకుని భార్యాభర్తల సూసైడ్

image

నెల్లూరు జిల్లాలో శుక్రవారం విషాద ఘటన జరిగింది. టీపీగూడూరు మండలం వరకవిపూడికి చెందిన ఈదూరు నరేశ్(34), ప్రమీలమ్మ(28) దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరూ ఇంట్లోనే ఒకే చీరకు ఉరేసుకున్నారు. కుటుంబంలో ఏం జరిగింది? ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News December 12, 2025

విశాఖ నుంచి సేవలు అందించనున్న IT సంస్థలు

image

AP: CM CBN కాగ్నిజెంట్ సహా 8 IT సంస్థల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్ నిర్మాణం 3 దశల్లో పూర్తి కానుంది. కాగా ఈ సంస్థలన్నీ విశాఖ నుంచి తమ కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. వీటి ద్వారా రాష్ట్రానికి ₹3,740 కోట్ల పెట్టుబడులు, దాదాపు 41,700 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఇప్పటికే VSP నుంచి 150కి పైగా కంపెనీలు సేవలందిస్తున్నాయని, ఐటీ నిపుణులకు అవకాశాలు పెరిగాయని ప్రభుత్వం పేర్కొంది.

News December 12, 2025

విశాఖలో సత్వా వాంటెజ్ సంస్థకు శంకుస్థాపన

image

దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కన్సల్టింగ్ సంస్థ అయిన సత్వా వాంటెజ్ క్యాంపస్‌ను ఐటీ శాఖ మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. రూ.1500 కోట్ల పెట్టుబడితో 3 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ క్యాంపస్‌లో 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, పరోక్షంగా 50 వేల మంది వరకు ఉపాధి పొందుతారని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.