News October 14, 2025
HYD: ఏడుగురు నేరస్థుల అరెస్ట్

HYD సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఆరుగురు ప్రాపర్టీ నేరస్థులు, ఒక బాల నేరస్థుడు అరెస్ట్ అయ్యాడు. మొత్తం 6 కేసులు డిటెక్ట్ చేసి, రూ.7 లక్షల విలువైన ఆస్తులు రికవరీ చేశారు. ఒక దొంగిలించిన టూ-వీలర్, 10 మొబైల్ ఫోన్లు, ఒక ఆటోను సీజ్ చేశారు. నిందితులు నగరంలో మొబైల్‌ఫోన్, టూ-వీలర్ దొంగతనాలకు పాల్పడుతున్న హ్యాబిట్యువల్ ఆఫెండర్స్ అని పోలీసులు తెలిపారు.
Similar News
News October 14, 2025
KNR: రోడ్డు ప్రమాదం.. పోతిరెడ్డిపేటవాసి మృతి

హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చింత సమ్మయ్య గౌడ్(45) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గ్రామ సబ్ స్టేషన్ సమీపంలో రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సమ్మయ్య గౌడ్ అక్కడికక్కడే మరణించగా.. మరొకరు గాయపడ్డారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ దుర్ఘటన పోతిరెడ్డిపేటలో విషాదాన్ని నింపింది.
News October 14, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. మహిళల ఓట్లే కీలకం..!

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పురుషుల ఓట్లు వివిధ పార్టీలకు డివైడ్ అయ్యే అవకాశం ఉన్నా మహిళల ఓట్లు మాత్రం ఒకే పార్టీకి గంప గుత్తగా పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం 3,98,982ఓటర్లు ఉండగా అందులో 1,91,590మంది మహిళా ఓటర్లే ఉన్నారు. కాగా ఫ్రీబస్సు స్కీమ్‌తో మహిళలు తమకే ఓట్లు వేస్తారని కాంగ్రెస్ నేతలు అంటుండగా గతంలో బతుకమ్మ చీరలిచ్చిన KCRవైపే మహిళలు ఉన్నారని BRSనేతలు చెబుతున్నారు.