News January 12, 2025

HYD: ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుంది: దానం

image

ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుందని MLA దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ కార్ రేసుతో HYD ఇమేజ్ పెరిగిందన్నాను.. కానీ అవినీతి జరగలేదని చెప్పలేదన్నారు. కంటి తుడుపు చర్యల్లా మూసీ వద్ద నాయకులు ఒక్కరోజు నిద్ర చేశారన్నారు. అక్కడికి వెళ్లే ముందే ACలు పెట్టించుకుని పడుకున్నారన్నారు. అక్కడివారు చేసిన జొన్న రెట్టేలు కాకుండా కిషన్ రెడ్డి బయట నుంచి ఇడ్లీలు తెప్పించుకున్నారని ఆరోపించారు.

Similar News

News January 12, 2025

HYD: భువనగిరి టోల్ గేట్ వద్ద ఇదీ పరిస్థితి..!

image

HYD నగరం ఉప్పల్ నుంచి బోడుప్పల్, ఘట్కేసర్ మీదుగా వరంగల్ వైపు వెళ్తున్న మార్గ మధ్యమంలో ఉన్న భువనగిరి టోల్ గేట్ వద్ద భారీ సంఖ్యలో వాహనాలు నిలిచాయి. టోల్ గేట్ నుంచి దాదాపు అర కిలోమీటర్ మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. పలువురు వాహనదారులు ఫాస్ట్ ట్యాగ్ చేయించుకోకపోవడంతో కాస్త ఆలస్యం అవుతోంది. ఏదేమైనప్పటికీ ఇదే మార్గంలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

News January 12, 2025

HYD: సంక్రాంతి స్పెషల్ బోర్డులు.!

image

బోడుప్పల్, KPHB, MGBS, JBS, కూకట్‌పల్లి కుషాయిగూడ ప్రాంతాల్లో సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులకు సైతం ముందస్తుగానే సంక్రాంతి స్పెషల్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాల్లో రద్దీ పెరిగితే వెంటనే సిటీ బస్సులను జిల్లా బస్సులుగా మార్చి, ప్రయాణికులను తరలిస్తున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. సిటీలో తిరిగే సర్వీసులకు అదనపు ఛార్జీలు లేవని, కేవలం జిల్లా స్పెషల్ సర్వీసులకే ఉన్నట్లు పేర్కొన్నారు. 

News January 12, 2025

HYD: హైడ్రాకు ప్రజావాణిలో 83 ఫిర్యాదులు

image

చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రోడ్లు, పుట్‌పాత్‌లను పరిరక్షణ ధ్యేయంగా ఏర్పాటు హైడ్రా దూకుడు పెంచింది. ఈ సంస్థ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు చెరువుల ఆక్రమణలు, ప్రభుత్వ భూముల కబ్జా, లేఅవుట్లు, ప్లాట్ల తగాదాలు, రోడ్డు ఆక్రమణల వంటి 10వేల ఫిర్యాదులు వచ్చాయి. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 83ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.