News October 17, 2025

HYD: ఏపీ మహిళపై అత్యాచారం చేసింది ఇతడే

image

రైలులో ప్రయాణికురాలిపై అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిని గుంటూరు రైల్వే పోలీసులు తెనాలిలో అదుపులోకి తీసుకన్నారు. పల్నాడులోని సత్తెనపల్లి పరిధి లక్కరాజుగార్లపాడుకు చెందిన జోన్నలగడ్డ రాజారావుగా గుర్తించారు. 2 నెలల క్రితం కేరళకు చెందిన మహిళపైనా అతడు అత్యాచారం చేసినట్లు వెల్లడైంది. మంగళవారం సికింద్రాబాద్ వస్తున్న సంత్రగాచి ఎక్స్‌ప్రెస్‌లో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

Similar News

News October 17, 2025

రేపటి బంద్‌లో అందరూ పాల్గొనాలి: భట్టి

image

TG: BCలకు రిజర్వేషన్లపై నిర్వహించే బంద్‌లో అందరూ పాల్గొనాలని Dy.CM భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ‘BRS రిజర్వేషన్లను 50%కి పరిమితం చేసి BC కోటాను తగ్గించింది. మేం సైంటిఫిక్ సర్వే లెక్కల ప్రకారం 42% కల్పించాం. బిల్లును ఆమోదించి పంపినా కేంద్రం ఆమోదించడం లేదు. అందుకే రిజర్వేషన్ల పెంపు కోర్టుల్లో నిలిచిపోతోంది. BJP నైజం బయటపడింది. వారిప్పుడు మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మరు’ అని భట్టి అన్నారు.

News October 17, 2025

HYD: నిమ్స్‌లో అనస్థీషియా విద్యార్థి అనుమానాస్పద మృతి

image

పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో అనస్థీషియా వైద్య విద్యార్థి నితిన్ అనుమానాస్పద మృతి చెందాడు. నిన్న రాత్రి విధులకు హాజరుకాగా.. ఇవాళ ఉదయం ఆపరేషన్ థియేటర్లో విగతజీవిగా పడి ఉన్నాడు. ఆస్పత్రి సిబ్బంది సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద మృతి పట్ల పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.