News February 11, 2026

HYD: ఏ జోన్‌లో ఎంతమంది కార్పొరేటర్లు అంటే?

image

GHMCని 3 కార్పొరేషన్లుగా విభజించారు. మల్కాజిగిరిలో 3 జోన్లు(మల్కాజిగిరి, Uppal, LBనగర్), 14 సర్కిళ్లు, 74 వార్డులున్నాయి (కార్పొరేటర్). HYDలో 6 జోన్లు(శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, SEC BAD), 30 సర్కిళ్లు, 150 వార్డులున్నాయి. సైబరాబాద్‌లో 3 జోన్లు(శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్), 16 సర్కిళ్లు, 76 వార్డులున్నాయి. మొత్తం 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులు.

Similar News

News February 11, 2026

మేడ్చల్‌లో 83.99 శాతం పోలింగ్

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మున్సిపాలిటీలలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎల్లంపేట 83.27, అలియాబాద్ 79.62, మూడుచింతలపల్లి 89.07 కలిపి మొత్తం 83.99 శాతం ఓట్లు నమోదయ్యాయి. ఈ పోలింగ్‌లో పురుషుల కంటే మహిళలే తమ ఓటు హక్కును ఎక్కువగా వినియోగించుకున్నారు.

News February 11, 2026

కోరుట్ల మున్సిపాలిటీలో 69.46% పోలింగ్

image

కోరుట్ల మున్సిపాలిటీలో మొత్తం 69.46% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. పట్టణంలోని మొత్తం 33 వార్డులలో 63,507 మంది ఓటర్లు ఉండగా.. 44,115 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు. మొత్తానికి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు వివరించారు. ఈనెల 13న కౌంటింగ్ జగిత్యాల ఎస్కేఎన్ఆర్ కళాశాలలో జరగనుంది.

News February 11, 2026

కామారెడ్డి: 45,629 మంది ఓటు హక్కు వినియోగించుకో లేదు

image

కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 1,49,525 ఓటర్లకు గాను 1,03,896 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 45,629 మంది ఓటు హక్కుకు దూరంగా ఉన్నారు. మొత్తం జిల్లాలో 69.48 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో మహిళలు అత్యధికంగా 54,487, పురుషులు 49,393 మంది, ఇతరులు 16 మంది ఓటు వేశారు.