News July 18, 2024

HYD: ఐటం సాంగ్‌లో KCR మాటలు.. డైరెక్టర్‌పై ఫిర్యాదు

image

డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌పై చర్యలు తీసుకోవాలని బోడుప్పల్ BRS యువజన నాయకులు గురువారం మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డబుల్ ఇస్మార్ట్ సినిమాలోని ఓ ఐటమ్ సాంగ్‌లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి KCR మాటలను వాడటం ఏంటన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఐటం సాంగ్‌లో ఉన్న KCR మాటలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఉప్పరి విజయ్, మోతే రాజు, వినయ్, రాకేశ్, వినయ్ కలిసి ఈ ఫిర్యాదు చేశారు.

Similar News

News February 21, 2026

HYD: TG EAPCET పరీక్షకు 20వేల దరఖాస్తులు

image

TG EAPCET ప్రవేశ పరీక్షకి ఈ రోజు ఇంజినీరింగ్ విభాగానికి 12,770 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించి 7,354 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 2 విభాగాలకు సంబంధించి 19 మంది దరఖాస్తు చేసుకున్నారని కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ రోజు వరకు 20,143 దరఖాస్తుకు వచ్చాయని కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.

News February 21, 2026

HYD: మాతృ భాష ‘బతుకు’నిచ్చింది!

image

“దేశ భాషలందు తెలుగు లెస్స” ఇది శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన వేదం. సమాజంలో తెలుగు భాషను లోకువ చేసే బ్యాచ్ తెలుసుకోవాల్సిన నిజం. మాతృ భూమి, భాషను నమ్ముకొన్న వాడు ఎక్కడా మోసపోలేదు. తెలుగు, సాహిత్యం మీద పట్టు పెంచుకొన్న ఎందరో కవులు చరిత్రలో నిలిచారు. లక్షలాది మందిని గొప్ప జర్నలిస్టులను చేసింది ఈ మాతృభాషనే. భాషను బతికించుకున్న ఎందరికో బతుకునిచ్చిందని మర్చిపోకండి.
నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.

News February 21, 2026

జూబ్లీహిల్స్‌లో Mukunda Jewellers ప్రారంభం

image

జూబ్లీహిల్స్‌లో ప్రముఖ జ్యువెలర్స్ Mukunda Jewellers తన తొలి ఫ్యాక్టరీ అవుట్‌లెట్‌ను ఫిబ్రవరి 20న ఘనంగా ప్రారంభించింది. మధ్యవర్తులు లేకుండా నేరుగా తయారీ ధరలకే వజ్రం, బంగారం, వెండి ఆభరణాలు అందించడం ప్రత్యేకత. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్, గౌరవ అతిథిగా కార్పొరేటర్ వెంకటేశ్ హాజరై ప్రారంభించారు. జూబ్లీహిల్స్ వాసులకు నాణ్యమైన పొదుపు అవకాశంగా ఈ అవుట్‌ లెట్ నిలువనున్నట్లు యాజమాన్యం తెలిపింది.