News March 26, 2024

HYD: ఒంటరిగా వెళ్లేవారే వీరి TARGET.. జర జాగ్రత్త!

image

ఒంటరిగా వెళుతున్న వారే లక్ష్యంగా దారి దోపిడీలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను HYD పటాన్‌చెరు పోలీసులు అరెస్టు చేశారు. CI ప్రవీణ్ రెడ్డి తెలిపిన వివరాలు.. పటాన్‌చెరులో ఉంటున్న ఏడుగురు సభ్యుల ముఠా HYDలో ఒంటరి మహిళలనే లక్ష్యంగా చేసుకొని దారి దోపిడీలకు పాల్పడుతోంది. సోమవారం ఇంద్రేశం వద్ద ORR సర్వీస్ రహదారిలో వాహనాలను తనిఖీ చేస్తుండగా పారిపోతున్న వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

Similar News

News January 9, 2025

HYD: ట్రై సైకిళ్లకు దివ్యాంగులు దరఖాస్తులు చేసుకోవాలి

image

ఛార్జింగ్ ట్రై సైకిల్‌లకు అర్హులైన దివ్యాంగులు దరఖాస్తులు చేసుకోవాలని వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగే తెలిపారు. సదరం సర్టీపికేట్ ఉండి, 80% శారీరక వైకల్యం, యూఐడి కార్డు, రేషన్ కార్డు, ఆధార్‌కార్డు ఉన్న దివ్యాంగులు అర్హులుగా తెలిపారు. 2పాస్ ఫోటోలు వికాలాంగులుగా గుర్తించే పూర్తి డాక్యుమెంట్స్ ఈ నెల 18లోపు 33 జిల్లాల అధ్యక్షులు 10మంది పేర్లు తయారు చేసి పంపించాలని కోరారు.

News January 9, 2025

గౌలిదొడ్డి గురుకులంలో 9వ తరగతికి ప్రవేశాలు

image

గచ్చిబౌలిలోని గౌలిదొడ్డి తెలంగాణ గురుకుల పాఠశాలలో 9వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని, ఫిబ్రవరి 23వ తేదీ లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 9వ తరగతి ప్రవేశ పరీక్షకు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు.

News January 9, 2025

HYD: జీడిపప్పుతో ఆరోగ్యానికి బోలెడు లాభాలు!

image

✓జీడిపప్పు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది✓చర్మ సంరక్షణకు దోహదపడుతుంది✓మెదడు పనితీరును సైతం మెరుగుపరుస్తుంది ✓కంటి చూపును సైతం మెరుగుపరిచే శక్తి ఉంది✓ఎముకలు బలంగా ఉండటానికి సహకరిస్తుంది✓రక్తంలోని చక్కర స్థాయిలను సైతం కంట్రోల్ చేస్తుంది. •జీడిపప్పు తినడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయని TGFPS-RR అనేక తెలిపారు.