News April 5, 2024

HYD: ఒంటిపై బల్లి పడిందని వెళ్లి చనిపోయాడు..!

image

ఓ వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD శివారు శంకర్‌పల్లి PS పరిధిలో జరిగింది. CI తెలిపిన వివరాలు.. మండల పరిధి మాసానిగూడ వాసి రాములు(35) వ్యవసాయం చేస్తుండేవాడు. కొన్ని రోజుల క్రితం అతడికి చికెన్ పాక్స్ (అమ్మోరు) వ్యాధి సోకడంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించే వాడు. ఇవాళ మధ్యాహ్నం తనపై బల్లి పడిందని, స్నానం చేసి వస్తానని చెప్పి తన పొలం వద్ద ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదైంది.

Similar News

News July 6, 2025

MNJ కేన్సర్ ఆస్పత్రికి 45 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు

image

MNJ కేన్సర్ ఆస్పత్రిలో ఇక మెరుగైన వైద్య సేవలందనున్నాయి. ఆస్పత్రికి 45 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను కేటాయిస్తూ మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. రోజురోజుకూ కేన్సర్ బాధితులు పెరిగిపోతుండటంతో లక్డీకపూల్(రెడ్ హిల్స్)లో ఉన్న MNJలో పేషెంట్లు చికిత్సకు ఇబ్బందులు ఏర్పడకుండా బోర్డు వీరిని నియమించింది.

News July 6, 2025

మహిళల రక్షణ కోసం ‘SWAT’ బృందం

image

HYD నగర పోలీసులు మహిళల భద్రత, నిరసన ప్రదర్శనల నిర్వహణ కోసం 35 మంది మహిళా పోలీసులతో “స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్(SWAT)”ను ప్రారంభించారు. కరాటే, నిరాయుధ పోరాటంలో ప్రత్యేక శిక్షణ పొందిన ఈ బృందం ధర్నాలు, ర్యాలీలు, ముఖ్యమైన ఈవెంట్లు, పండుగల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేస్తుంది. సరికొత్త యూనిఫాంలో సచివాలయం వద్ద విధుల్లో చేరిన ఈ బృందం.. మహిళల ఆందోళనలు నియంత్రించడంలో కీలకపాత్ర పోషించనుంది.

News July 6, 2025

చివరికి కల్లు కాంపౌండుకు రమ్మంటారా ఏంటి..?: జగ్గారెడ్డి

image

‘రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు కేసీఆర్‌ను అసెంబ్లీకి ఆహ్వానిస్తే ప్రెస్ క్లబ్, బోట్స్ క్లబ్‌కు రావాలని.. అక్కడ చర్చిద్దామని కేటీఆర్ అంటున్నాడు. చివరికి కల్లు కాంపౌండుకు రావాలని పిలుస్తారా ఏంటి?’అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. CM రేవంత్.. కేసీఆర్‌ను పిలుస్తుంటే సెకెండ్ బెంచ్ లీడర్లు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని గాంధీభవన్‌లో విమర్శించారు.