News February 6, 2025

HYD: ఒకే రోజు 10 మంది మృతి!

image

HYDలో విషాద ఘటనలు వెలుగుచూశాయి. నిన్న ఒక్కరోజే 10 మంది చనిపోయారు. LBనగర్‌‌లో గోడ కూలి ముగ్గురు మృతి చెందారు. గచ్చిబౌలిలో రిటోజ, SRనగర్‌లో అమర్‌జిత్, రాయదుర్గంలో ధర్మప్రధాన్, షాద్‌నగర్‌లో నీరజ్, చెరువులో దూకి పీర్జాదిగూడ వాసి బాలరాజు, మీర్‌పేటలో వెంకటేశ్ ఆత్మహత్య చేసుకున్నారు. వేర్వేరు కారణాలతో ఆరుగురు సూసైడ్ చేసుకోగా.. శంకర్‌పల్లిలో బస్ ఢీ కొని బీటెక్ విద్యార్థి మృతి చెందడం బాధాకరం.

Similar News

News February 6, 2025

ఆదిలాబాద్: ‘వార్షిక పరీక్షలపై ఒత్తిడికి గురికావద్దు’

image

సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో బీసీ స్టడీ సర్కిల్ ఆదిలాబాద్‌లో ఫ్రీ మెట్రిక్ వసతి గృహ పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతుల కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రాజార్షి షా పాల్గొని ప్రారంభించారు. పదోతరగతి విద్యార్థులకు వార్షికపరీక్షలకు అవసరమైన సామగ్రిని కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు.

News February 6, 2025

సర్పంచ్ ఎన్నికలు.. వికారాబాద్ జిల్లా పూర్తి వివరాలు

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మన వికారాబాద్ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు 4, మున్సిపాలిటీ‌లు 4 ఉన్నాయి. ఇదిలా ఉంటే ZPTC-20, MPP-20, MPTC-227, గ్రామ పంచాయతీలు-594, వార్డులు 5058 ఉన్నాయి. ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండడంతో‌ గ్రామాల్లో సందడి నెలకొంది.

News February 6, 2025

బొంరాస్‌పేట్: చెరువులో గల్లంతైన యువకుడి శవం లభ్యం

image

బొంరాస్‌పేట్ మండలం పెద్దచెరువులో మంగళవారం గల్లంతైన కుదురుమల్ల గ్రామానికి చెందిన యువకుడు రాజు(26) మృతదేహాం ఇవాళ ఉదయం తేలింది. మృతదేహాన్ని చూడగానే కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. గమనించిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. అక్కడికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి పంచనామా నిమిత్తం తరలించారు. 

error: Content is protected !!