News October 3, 2024
HYD: ఒక్క క్లిక్‌తో.. భూ వివరాలు మన చేతుల్లో!

HYD, RR, MDCL, నల్గొండ, సంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట జిల్లాలకు HMDA 2031 మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. అయితే మాస్టర్ ప్లాన్ సహా, ఈ 7 జిల్లాల పరిధిలోని భూ వివరాలను ఒక్క క్లిక్‌తో ప్రజలు చూసుకునేందుకు ప్రత్యేక యాప్ రానుంది. ఇందులోనే చెరువుల FTL, బఫర్ జోన్ వివరాలు సైతం ఉంటాయి. భవన అనుమతులకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News September 19, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై నేడు కేటీఆర్ సమావేశం

నేడు BRS నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై చర్చించనున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, జూబ్లీహిల్స్‌లోని ముఖ్య నేతలతో ఇవాళ సమావేశం కానున్నారు. అభ్యర్థితో పాటు గ్రౌండ్ లెవెల్‌లో పనిచేసి విజయం సాధించడానికి చేయాల్సి కార్యచరణపై ఇవాళ చర్చించనున్నారు.
News September 19, 2025
వారంలో మూడు రోజులు ముచ్చింతల్‌కు బస్సులు

ఆధ్యాత్మిక కేంద్రం ముచ్చింతల్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేశారు. ఈ నెల 20 నుంచి శుక్ర, శని, ఆదివారాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. JBS, ఆఫ్జల్‌గంజ్, సికింద్రాబాద్, KPHB, ఉప్పల్, రిసాలాబజార్ ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతామన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సౌకర్యం ఉంటుందని వివరించారు.
News September 19, 2025
కోకాపేట్‌లో భర్తను చంపిన భార్య

కోకాపేట్‌లో భర్తను భార్య హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల ప్రకారం.. గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్తపై భార్య కత్తితో దాడి చేసింది. ఇంట్లో నుంచి కేకలు రావడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. వారిని అస్సాంకి చెందిన వారిగా గుర్తించారు. భార్యాభర్తల మధ్య విభేదాలే ఈ దారుణానికి దారితీసింది.