News May 23, 2024

HYD: ఒక్క మెసేజ్‌తో రూ.11.20 లక్షలు స్వాహా

image

స్టాక్ మార్కెట్‌లో లాభాలిస్తామని ఓ గృహిణి నుంచి రూ.11.20 లక్షలను సైబర్ నేరగాళ్లు లూటీ చేశారు. HYD నారాయణగూడకు చెందిన గృహిణికి స్టాక్ మార్కెట్‌లో లాభాలు వస్తాయని ఓ మెసేజ్ వచ్చింది. దాంట్లో ఉన్న లింకును క్లిక్ చేయగా ఒక యాప్ డౌన్‌లోడ్ అయింది. దాంట్లో మొదట కొంత పెట్టుబడి పెట్టగా లాభాలు వచ్చాయి. దీంతో విడతల వారీగా రూ.11.20 లక్షలు పెట్టుబడి పెట్టగా విత్ డ్రా అవ్వలేదు. బాధితురాలు CCSలో ఫిర్యాదు చేసింది.

Similar News

News October 1, 2024

హైదరాబాద్‌లో STAY ALERT

image

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసింది. మరో 2 గంటలు నగరంలో కుండపోత వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా మణికొండ, మాదాపూర్, KPHB, బాలానగర్‌, నార్సింగి, అత్తాపూర్, మియాపూర్, ట్యాంక్‌బండ్ పరిసరాల్లో వర్ష సూచన ఉందన్నారు. ఇప్పటికే నార్సింగిలో వాన దంచికొడుతోంది.
SHARE IT

News October 1, 2024

HYD: దేవాలయాల్లోని ప్రసాదాలకు FOOD లైసెన్స్

image

HYDలోని పలు దేవాలయాల్లో విక్రయించే ప్రసాదాలకు ఫుడ్ లైసెన్సులు జారీ చేశారు. ఇందులో SEC-మహంకాళి టెంపుల్, బల్కంపేట-ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానం, కర్మాన్‌ఘాట్-హనుమాన్ దేవస్థానం, ఎస్పీరోడ్డు-వీర హనుమాన్ దేవస్థానం, సనత్ నగర్- హనుమాన్ దేవస్థానం, జూబ్లీహిల్స్-పెద్దమ్మ దేవాలయం, వివేక్ నగర్ హనుమాన్ దేవాలయం, RTC క్రాస్ రోడ్డు లక్ష్మీగణపతి దేవస్థానం,మినిస్టర్ రోడ్డు శ్రీసాయిబాబ సమాజం, SEC-గణేష్ టెంపుల్ ఉన్నాయి.

News October 1, 2024

సోనూసూద్ వద్దకు దామగుండం సమస్య

image

దామగుండం అటవీ సమస్యను పూడూరు నాయకులు నటుడు, సామాజికవేత్త సోనుసూద్‌కు వివరించారు. వికారాబాద్ జిల్లా పూడూరు దామగుండంలో నేవీ రాడార్ ఏర్పాటైతే అడవి పూర్తిగా నాశనం అవుతుందని వాపోయారు. దీని ఏర్పాటుకు అడవిలో మొక్కలు, వృక్షాలు నరికేస్తారని, మూగజీవాలు అంతరించిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీని గురించి పరిశోధించి ఆ తర్వాత కార్యచరణ చెబుతానని ఆయన భరోసా ఇచ్చారు.