News January 26, 2025
HYD: ఒక కిలోమీటర్ మెట్రోకు రూ.317 కోట్లు..!

HYD మెట్రో ప్రాజెక్టు ఫేజ్-2లో పార్ట్-A కింద 5 మెట్రో కారిడార్ల డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు (DPR) సిద్ధమైనట్లు సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. 76.4KM మెట్రోకు రూ.24,269 కోట్ల ఖర్చు అవుతుందని రిపోర్టులో ఉంది. అంటే సుమారు 1KM మెట్రోకు రూ.317 కోట్లు.ఈ ప్రాజెక్టు రిపోర్టులను కేంద్రం ఆమోదించాలని,కేంద్ర,రాష్ట్ర భాగస్వామ్యంతో నిర్మించడానికి నిధులు విడుదల కేటాయించాలని కోరారు.
Similar News
News September 16, 2025
ఖమ్మం: విదేశీ విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం జిల్లాకు చెందిన బీసీ, ఈబీసీ విద్యార్థుల విదేశీ విద్య కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జ్యోతి తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో విదేశాలకు వెళ్లి చదువుకోవాలనే ఆసక్తి ఉన్నవారు ఈ నెల 24 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు, వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉండాలని పేర్కొన్నారు.
News September 16, 2025
ఎస్.ఐ.ఆర్ నిర్వహణకు అధికారులను సన్నద్ధం చేయాలి

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్(ఎస్.ఐ.ఆర్)పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం సమీక్ష నిర్వహించారు. 2002లో జరిగిన ఎస్.ఐ.ఆర్ డేటాను ప్రస్తుత 2025 జాబితాతో పోల్చి తప్పుడు వివరాలను గుర్తించి సరిదిద్దాల్సిన అవసరం ఉన్నట్లు తెలిపారు. ప్రతి బూత్ సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించి, ప్రతిరోజు లక్ష్యాలతో కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
News September 16, 2025
వరికి అధికంగా యూరియా వేస్తున్నారా?

వరి నాట్లు వేసిన 2-3 వారాల మధ్య.. పైరు చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు రెండుసార్లు యూరియా వేయాలి. ప్రతిసారీ ఎకరాకు 35 నుంచి 45 కిలోల యూరియా వేస్తే సరిపోతుంది. చాలామంది రైతులు మాత్రం ఎకరాకు ఒకటిన్నర నుంచి రెండు బస్తాల వరకు యూరియా వేస్తున్నారు. అధిక యూరియా వల్ల అధిక దిగుబడి వస్తుందనే ఉద్దేశంతో రైతులు ఇలా చేస్తున్నారు. దీని వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.