News August 19, 2025

HYD: ఓయూలో ఘనంగా స్నాతకోత్సవం!

image

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో 84వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. మంగళవారం మొత్తం 121 బంగారు పతకాలను ఓయూ ఛాన్స్‌లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఛైర్మన్ డాక్టర్ నారాయణన్, ఓయూ ఉపకులపతి మొలుగరం ఆచార్య కుమార్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఆయా విభాగాల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన 1,261 మంది పరిశోధకులు పట్టాలు అందుకున్నారు.

Similar News

News April 14, 2026

వికారాబాద్: రూ.500కే 50 కిలోల బస్తా..!

image

ఉల్లి రైతులకు జిల్లాలో కన్నీళ్లే మిగులుతున్నాయి. పంట దిగుబడి బాగా వచ్చినప్పటికీ మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేసేదేంలేక VKB పట్టణంలోని ప్రధాన రోడ్లపైకి ట్రాక్టర్లతో ఉల్లిని తెచ్చి విక్రయిస్తున్నారు. 50కిలోల బస్తాను రూ.500కే అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర కల్పించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందంటున్నారు.

News April 14, 2026

PSL.. ముజరబానీపై రెండేళ్లపాటు నిషేధం

image

ZIM బౌలర్ ముజరబానీపై PSL రెండేళ్లపాటు నిషేధం విధించింది. PSLలో ఆడాల్సిన ఆయన, ఆ ఒప్పందాన్ని కాదని IPLలో ఆడేందుకు KKR జట్టులో చేరారు. ఇలా చేయడం ప్రొఫెషనలిజం కాదని, అందుకే వచ్చే 2 సీజన్లలో ఆడకుండా బ్యాన్ చేస్తున్నట్లు PSL ప్రకటించింది. MI ప్లేయర్ బాష్‌‌‌నూ గత సీజన్లో ఏడాదిపాటు నిషేధించింది. కాగా IPL కోసం PSL నుంచి తప్పుకున్న వారిలో శనక, స్పెన్సర్ జాన్సన్ కూడా ఉన్నారు. వారినీ బ్యాన్ చేసే ఛాన్సుంది.

News April 14, 2026

పెద్దపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో శ్రీధర్ బాబు

image

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన డా. బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాల సాధనే తమ లక్ష్యమని, సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యేలు విజయరమణారావు, నాయకులు పాల్గొన్నారు.