News March 20, 2025
HYD: ఓయూలో తగ్గేదే లే!

ఓయూలో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. నిరసనలు నిషేధం అన్న సర్క్యూలర్ అగ్గిరాజేసింది. ఉమ్మడి రాష్ట్రంలో లేని ఆంక్షలు ఇప్పుడు పెట్టడం ఏంటని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. వామపక్షాలు నేడు బంద్‌కు పిలుపునివ్వడంతో విద్యార్థులు మళ్లీ రోడ్డెక్కారు. ఇది నిబంధన కాదు నిర్బంధం అంటూ గొంతెత్తారు. వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. ఇక అధికారులూ బెట్టు వీడకపోవడంతో పోలీసులు రంగప్రవేశం తప్పడం లేదు. దీనిపై మీ కామెంట్?
Similar News
News November 6, 2025
కుమ్మెరలో 42.5 మిల్లీమీటర్ల వర్షపాతం

గడచిన 24 గంటలలో నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు గురువారం ప్రకటించారు. నాగర్‌కర్నూల్ మండలంలోని కుమ్మెరలో 42.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. పాలెంలో 33.5, లింగాలలో 22.5, కల్వకుర్తిలో 15.5, బిజినేపల్లిలో 15.0, కొండనాగులలో 13.8, పెద్దముద్దునూరులో 10.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.
News November 6, 2025
నిర్మల్: సన్న బియ్యం గుర్తించేందుకు నూతన పరికరం

సన్న బియ్యానికి ప్రభుత్వం బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వాటిని గుర్తించేందకు అధికారులు కొత్త పరికరాన్ని అందుబాటులోకి తెచ్చారు. సన్నాలను గుర్తించేందుకు గ్రేన్ కాలిపర్ పరికరాన్ని వాడనున్నారు. బియ్యం గింజ పొడవు, వెడల్పు వంటి ప్రమాణాలను దాని ద్వారా కొలిచి సన్న, దొడ్డు రకాలను తేల్చవచ్చు. పొట్టు తీసిన బియ్యం గింజను పరికరంతో కొలిచి వచ్చిన శాతం ఆధారంగా సన్నాలను గుర్తిస్తారు.
News November 6, 2025
NLG: సిక్స్ లేన్లుగా హైవే విస్తరణకు నోటిఫికేషన్!

HYD–VJD మధ్య ప్రయాణం మరింత వేగవంతం కానుంది. ప్రస్తుతం ఉన్న 4 లేన్ల నుంచి 6 లేన్లుగా (231.32KM దూరం) విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిర్మాణాలు చేయనున్నారు. రూ.10,391 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే HYD నుంచి VJDకు ప్రయాణం 2 గంటలు తగ్గనుంది. 6 వరుసలుగా మారితే ప్రమాదాలతో పాటు ప్రయాణ కష్టాలు తొలగనున్నాయి.


