News March 11, 2025
HYD: ఓయూలో భోజనంలో బ్లేడ్

OUలో విద్యార్థులు కంగుతినే ఘటన వెలుగుచూసింది. మంగళవారం భోజనంలో రేజర్ బ్లేడు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. న్యూ గోదావరి హాస్టల్ మెస్‌లో రాత్రి విద్యార్థులు డిన్నర్ చేస్తున్నారు. ఆహారంలో బ్లేడ్ కనిపించడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి నోట్లోకైనా వెళ్లి ఉంటే వారి పరిస్థితి ఏంటని వాపోయారు. నాణ్యమైన ఆహారం అందించాలంటూ ఎన్నిసార్లు ఆందోళన చేసినా ఫలితం లేదని మండిపడ్డారు.
Similar News
News March 12, 2025
చింతలమానేపల్లి: స్థానిక సంస్థల్లో కమలం వికసించాలి: ఎమ్మెల్యే

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్ బాబు అన్నారు. మంగళవారం చింతనమానేపల్లి మండలంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ మొదలు పార్లమెంట్ వరకు కమలం వికసించాలని కార్యకర్తలకు సూచించారు. పట్టబద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఓటు వేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
News March 12, 2025
ఎలక్ట్రికల్ పోల్ పడి కే.కోటపాడు వ్యక్తి మృతి

గాజువాక సమీపంలో గల నాతయ్యపాలెం డైరీ వద్ద మంగళవారం సాయంత్రం RTC బస్సు ఎలక్ట్రికల్ పోల్‌ను ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిలో K.కోటపాడుకు చెందిన బొత్స కామేశ్వరరావు(37) తీవ్ర గాయాలవ్వగా స్థానికుల వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన నిన్న రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనలో గాయపడ్డ మరో మహిళ దొడ్డి సత్యవతి చికిత్స పొందుతోంది. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 12, 2025
రాజమండ్రి: ఆ రైళ్లు సికింద్రాబాద్ వెళ్లవు..!

సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులు ముమ్మరం కావడంతో స్టేషన్‌కు వచ్చే 14 ముఖ్యమైన రైళ్ల రూటును మార్చేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. లింగంపల్లి- కాకినాడ స్పెషల్ (07445/07446) ఏప్రిల్ 2 నుంచి, లింగంపల్లి- విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12805/12806) ఏప్రిల్ 25 నుంచి సికింద్రబాద్‌కు రాకుండానే చల్లపల్లి మీదుగా నడుస్తాయని సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.