News February 14, 2025

HYD: ఓయూ ఓపెన్ డిగ్రీ ప్రవేశ ప్రకటన

image

ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జి.రామ్‌రెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఓపెన్ డిగ్రీ కోర్సుల రెండో విడత ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రవేశాలు UGC-దూరవిద్య బ్యూరో (DEB) మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. అభ్యర్థులు www.osmania.ac.in లేదా oucde.net వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి వివరాలను పొందవచ్చు. దరఖాస్తుకు చివరి తేది 31 మార్చి 2025.

Similar News

News November 3, 2025

జుట్టు రాలడాన్ని నివారించే తమలపాకులు

image

ప్రస్తుతకాలంలో వయసుతో సంబంధం లేకుండా అందర్నీ హెయిర్ ఫాల్ సమస్య వేధిస్తోంది. దీనికి చెక్ పెట్టడానికి ఈ తమలపాకులు ఉపయోగపడతాయి. * తమలపాకులని కడిగి పేస్టుచేసి అందులో కాస్త నెయ్యి కలపాలి. దీన్ని మాడునుంచి జుట్టు చివర్ల వరకు పట్టించాలి. గంట తర్వాత కడిగేస్తే సరిపోతుంది. * తమలపాకు పేస్ట్‌లో కాస్త కొబ్బరి నూనె, ఆముదం కలిపి జుట్టుకు పట్టించాలి. గంట తర్వాత కడిగేస్తే జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది.

News November 3, 2025

WWC-2025 ‘లీడింగ్’ రికార్డులు

image

☞ అత్యధిక వికెట్లు-22(దీప్తి శర్మ-భారత్)
☞ సిక్సర్లు- 12(రిచా ఘోష్-భారత్)
☞ పరుగులు- 571(లారా-దక్షిణాఫ్రికా)
☞ వ్యక్తిగత స్కోరు- 169(లారా)
☞ సెంచరీలు-2(లారా, గార్డ్‌నర్, హేలీ)
☞ అర్ధసెంచరీలు-3(లారా, దీప్తి శర్మ)
☞ అత్యధిక ఫోర్లు-73(లారా)
☞ ఈ టోర్నీలో భారత్ తరఫున మంధాన, ప్రతీకా, రోడ్రిగ్స్ సెంచరీలు చేశారు.

News November 3, 2025

ప్రకాశం: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు నోటీసులు

image

రాజకీయంగా, వ్యక్తిగతంగా చాలామంది వాట్సాప్ గ్రూపులను దుష్ప్రచారానికి వాడుతున్నారు. తెలిసీతెలియక గ్రూపుల్లో వచ్చే తప్పుడు సమాచారాన్ని క్రాస్ చెక్ చేయకుండా షేర్ చేస్తున్నారు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు నోటీసులు ఇస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టింగులు చేసినా? తప్పుడు ప్రచారం చేసినా అడ్మిన్లు బాధ్యత వహించాలని చెబుతున్నారు. మీకూ నోటీసులు ఇచ్చారా?