News March 20, 2025
HYD: ఓయూ బంద్‌కు పిలుపు

ఓయూలో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిషేధం అని అధికారులు విడుదల చేసిన సర్క్యూలర్‌పై వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవల ABVP బంద్‌కు పిలుపునివ్వగా ఎక్కడికక్కడ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు SFI, AISF, PDSU, PDSU(V)AIDSO, PSU సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఓయూ విద్యార్థుల గొంతులు నొక్కే అప్రజాస్వామిక సర్క్యూలర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
Similar News
News March 20, 2025
పాలమూరు యూనివర్సిటీకి పెరిగిన కేటాయింపులు

పాలమూరు యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. యూనివర్సిటీ అధ్యాపకుల వేతనాలకు రూ.12.95 కోట్లు, పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధి కోసం రూ.35 కోట్లు మంజూరు చేసింది. మొత్తం రూ.47.95 కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా VC శ్రీనివాస్, రిజిస్టర్ చెన్నప్ప మాట్లాడుతూ.. యూనివర్సిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.
News March 20, 2025
ఎస్సీలను ఆదుకుంది TDPనే: చంద్రబాబు

AP: ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం ఇళ్లు ఇచ్చింది ఎన్టీఆరేనని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎస్సీలను అన్నివిధాల ఆదుకుంది టీడీపీనేనని అసెంబ్లీలో పేర్కొన్నారు.. ‘దళితులైన బాలయోగిని లోక్‌సభ స్పీకర్, ప్రతిభాభారతిని అసెంబ్లీ స్పీకర్, కాకి మాధవరావును సీఎస్ చేశాం. ఎస్సీల కోసం రూ.8,400 కోట్లతో పథకాలు తీసుకొచ్చాం. ఉగాది నుంచి పీ4 ప్రారంభిస్తాం. వర్గీకరణకు సహకరించిన BJPకి, పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
News March 20, 2025
HYDలో మిస్ వరల్డ్ పోటీలు: జూపల్లి

TG: హైదరాబాద్ వేదికగా మే 7 నుంచి 31 వరకు 72వ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. 140 దేశాల అతిథులకు తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసేందుకు ఇదొక గొప్ప అవకాశమన్నారు. అలాగే రాష్ట్రానికి ఆర్థికంగానూ లబ్ధి చేకూరుతుందని చెప్పారు. స్క్విడ్ గేమ్, BTS బ్యాండ్ లాంటివి సౌత్ కొరియా అభివృద్ధికి ఉపయోగపడ్డాయని తెలిపారు. మిస్ వరల్డ్ ఈవెంట్‌ను రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు.