News February 8, 2025

HYD: ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలి: MLC కవిత

image

అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని MLC కవిత అన్నారు. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద వివిధ దేశాల్లో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థులతో BRS ఎమ్మెల్సీ కవిత జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లకు డబ్బులు విడుదల చేస్తున్నారు కానీ, విద్యార్థుల చదువుకు బకాయిలు విడుదల చేయడానికి మాత్రం డబ్బులు లేవా అని ప్రశ్నించారు. తక్షణమే నిధులు విడుదల చేయాలన్నారు.

Similar News

News February 8, 2025

గండిపేట: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్

image

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని RR జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. గండిపేట మండలం నార్సింగిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు స్వచ్ఛమైన రుచికరమైన ఆహారం అందించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

News February 8, 2025

UPDATE: బాలికపై లైంగిక దాడి..రిమాండ్

image

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇన్‌ఫ్రంట్ జీసస్ ఇంటర్నేషనల్ <<15393818>>స్కూల్ డ్రైవర్ <<>>6ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన విషయం తెలిసిందే. కాగా, జోసఫ్ రెడ్డిపై పోక్సో యాక్ట్ కింద మంచాల పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసిన మంచాల పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

News February 8, 2025

అబిడ్స్ DIపై భార్య ఫిర్యాదు

image

అబిడ్స్ పోలీస్ స్టేషన్ డీఐ నరసింహపై ఆయన భార్య సంధ్య హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పెళ్లై 12 ఏళ్లు అవుతుందని, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, అదనపు కట్నం ఇవ్వకపోతే రెండో పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

error: Content is protected !!