News September 23, 2025

HYD: ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి!

image

కొద్ది రోజులుగా HYDలో వాన యుద్ధం చేసినట్లు అనిపిస్తోంది. పంజాగుట్టలోని NIMS వద్ద సోమవారం వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపుల శబ్ధాలతో అంతా దద్దరిల్లిపోయింది. పిడుగులు పడుతున్నట్లు భయాందోళన మొదలైంది. ఇటువంటి వాతావరణం నగరవాసులకు సవాల్‌గా మారుతోంది. వరదలో ప్రయాణం, గమ్యం చేరడం గగనమైంది. ఉద్యోగుల కష్టాలు వర్ణణాతీతం. నగరవాసుల్లో ఈ ఒక్క పూట వాన పడకుంటే చాలు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Similar News

News September 23, 2025

8 నిమిషాలు ఆగిపోయిన మెట్రో

image

హైదరాబాద్‌ మెట్రో రైలు సేవలు మరోసారి నిలిచిపోయాయి. మంగళవారం భరత్‌నగర్‌ స్టేషన్‌లో 8 నిమిషాలకి పైగా రైలు ఆగిపోయింది. సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిందని మెట్రో అధికారులు చెబుతున్నారు. అప్పుడప్పుడు ఇలా టెక్నికల్ ఇష్యూస్ వస్తాయని, వాటిని ప్రయాణికులు అర్థం చేసుకోవాలని సూచించారు.

News September 23, 2025

జూబ్లీహిల్స్‌ క్లాస్ అనుకుంటున్నారా.. ఊర మాస్!

image

జూబ్లీహిల్స్‌ను అంతా కాస్ట్‌లీ నియోజకవర్గమని పిలుస్తారు. విశాలమైన భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లతో గ్రాండ్‌గా కనిపిస్తది. కానీ, జూబ్లీహిల్స్‌ MLAను ఎన్నుకునేది మాత్రం పేదలే అని ఎందరికి తెలుసు. అవును, నియోజవకర్గంలోని మెజార్టీ డివిజన్లు పక్కా మాస్. షేక్‌పేట, ఎర్రగడ్డ, బోరబండ, రహమత్‌నగర్‌, యూసుఫ్‌గూడ‌, సోమాజిగూడ‌లోని మధ్య తరగతి, పేదలే ఓట్లేస్తారు. ఇక్కడ అందమైన భవంతులే కాదు అంతకుమించి బస్తీలున్నాయి.

News September 23, 2025

పేరు జూబ్లీహిల్స్.. ఊరు ఖైరతాబాద్

image

మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదనేది ఎంత నిజమో.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ డివిజన్ ఉండదనేది అంతే నిజం. ఉప ఎన్నిక సమీపిస్తోంది. అంతటా ప్రచారం చేస్తోన్న నాయకులు జూబ్లీహిల్స్ డివిజన్‌‌ను టచ్ చేయడం లేదు. ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, బోరబండ, షేక్‌పేట, రహమత్‌నగర్, వెంగళరావునగర్, సోమాజిగూడ(PART)‌లో పర్యటిస్తున్నారు. పేరుకే ‘జూబ్లీహిల్స్’ అయినా ఈ డివిజన్ ఖైరతాబాద్‌ అసెంబ్లీ పరిధిలో ఉండటం గమనార్హం.