News September 23, 2025
HYD: ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి!

కొద్ది రోజులుగా HYDలో వాన యుద్ధం చేసినట్లు అనిపిస్తోంది. పంజాగుట్టలోని NIMS వద్ద సోమవారం వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపుల శబ్ధాలతో అంతా దద్దరిల్లిపోయింది. పిడుగులు పడుతున్నాయా? అని స్థానికుల్లో ఆందోళన మొదలైంది. ఇటువంటి వాతావరణం నగరవాసులకు సవాల్‌గా మారుతోంది. వరదలో ప్రయాణం, గమ్యం చేరడం గగనమైంది. ఉద్యోగుల కష్టాలు వర్ణణాతీతం. నగరవాసుల్లో ఈ ఒక్క పూట వాన పడకుంటే చాలు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Similar News
News September 23, 2025
MLG: CM మీటింగ్.. తాగునీరు లేక అల్లాడుతున్న మహిళలు

తాడ్వాయి మండలం మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా వేల సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. సుమారు 3 గంటలకు పైగా వేచి ఉన్న తమకు కనీసం తాగునీరు, స్నాక్స్ కూడా ఇవ్వడం లేదని మహిళలు వాపోయారు. దాహం, ఆకలితో అలమటిస్తున్నామన్నారు. ఎవరిని అడిగినా కనీసం మంచినీరు ఇవ్వడం లేదని, ఉక్కపోత, దప్పికతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News September 23, 2025
MRKP: వచ్చే ఏడాది పులుల లెక్కింపు

నల్లమల్ల ఫారెస్ట్‌లోని వన్యప్రాణులను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని మార్కాపురం DFO మహమ్మద్ రఫీ తెలిపారు. ‘ఎకో టూరిజంలో గైడ్లను ఏర్పాటు చేసి అడవుల ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తాం. వచ్చే ఏడాది కేంద్ర బృందం ఆధ్వర్యంలో ట్రాప్ కెమెరాల ద్వారా పులుల లెక్కింపు జరుగుతుంది’ అని వెల్లడించారు.
News September 23, 2025
‘OG’లో అకీరానందన్?

పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమాలో ఆయన కుమారుడు అకీరానందన్ నటించినట్లు చర్చ జరుగుతోంది. కత్తిపై ఓ కుర్రాడి కళ్లు కనిపించగా.. అవి అకీరావేనని ఫ్యాన్స్ అంటున్నారు. కచ్చితంగా ఎంట్రీ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ పక్కన రాహుల్ రవీంద్రన్ నటించగా ఎడిటింగ్‌లో ఆ పాత్రను తొలగించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అది దర్శకుడి నిర్ణయమని ఓ ఫ్యాన్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.