News August 13, 2025
HYD: ఔటర్ ఆదాయం.. రూపాయల్లో రాబడి.. పైసల్లో కిరాయి..!

రూపాయల్లో ఆదాయం వస్తోంటే.. కిరాయి మాత్రం పైసల్లో.. ఇదీ HYD ఔటర్ రింగ్ రోడ్డు లీజు తీరు. 2023 ఆగస్టు 11 నుంచి ఐఆర్బీ సంస్థకు అప్పటి ప్రభుత్వం 30 ఏళ్లకు రూ.7,380 కోట్లకు ఔటర్ లీజుకిచ్చింది. అయితే ఔటర్ ఆదాయం ఎంత వస్తోందో తెలుసా.. ఈ సంవత్సరం జూన్ వరకు రూ.414 కోట్లు వచ్చాయి. అంటే నెలకు సుమారు 70 కోట్లు.. 30 ఏళ్లకు రూ.25,200 కోట్లు (ఇప్పటి వాహనాల సంఖ్యకు).. ఇక వాహనాలు పెరిగితే.. వామ్మో డబ్బే.. డబ్బు..!
Similar News
News August 13, 2025
HYDలో వాట్సాప్ ద్వారా బస్ టికెట్

HYDలోని ఆర్టీసీ బస్సుల్లో క్యూ ఆర్ కోడ్ డిజిటల్ టికెటింగ్ సక్సెస్ అయిన నేపథ్యంలో వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా టికెట్ అందించే ప్రయత్నాలు అధికారులు చేస్తున్నారు. మియాపూర్, కంటోన్మెంట్ డిపోల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నిత్యం నడిపే పుష్పక్ బస్సుల్లో మొదట పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేసి పరిశీలించనున్నారు. ఇది సక్సెస్ అయితే సిటీలోని మిగతా బస్సులకు సైతం విస్తరించనున్నారు.
News August 13, 2025
HYD: మీ దానం.. స‘జీవం’

తాను మరణించినా మరొకరు బతకాలనే ఆలోచన గొప్పది. ఈ విషయంలో HYD దాతలకు చేతులెత్తి మొక్కాల్సిందే. ఇటీవల నార్సింగికి చెందిన డా.భూమిక బ్రెయిన్‌డెడ్ కావడంతో అవయవదానం చేసి ఆరుగురికి ప్రాణం పోసింది. గతంలో CYB కానిస్టేబుల్ ఆంజనేయులుకు యాక్సిడెంట్‌లో బ్రెయిన్‌డెడ్ అయ్యింది. ఆర్గాన్ డొనేట్ చేసి, 8 మందికి ప్రాణం పోశాడు. ఇలాంటి దాతలు సిటీలో ఎందరో ఉన్నారు. వారికి సెల్యూట్ చేద్దాం.
నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం.
News August 13, 2025
భారీ వర్షాలు.. HYD వాసులకు పోలీసుల సూచనలు

☛15వ తేదీ వరకు వర్ష సూచన
☛సాయంత్రం వేళల్లో భారీ వర్షం కురిసే అవకాశం
☛అత్యవసరం ఉంటేనే బయటకురావాలి
☛వెదర్ అప్‌డేట్స్ ఫాలో అవుతూ పనులు షెడ్యూల్ చేసుకోండి
☛వాహనాల కండీషన్ పరిశీలించండి
☛నీరు నిలిచి ఉండే ప్రాంతాల్లో జాగ్రత్త
☛వర్షంలో చెట్ల కింద, కరెంట్ పోల్స్ దగ్గర నిలబడొద్దు
NOTE: జాగ్రత్తలు పాటించండి.. క్షేమంగా గమ్యం చేరండి అని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.
SHARE IT