News March 20, 2024

HYD: కంటోన్మెంట్‌ ఉపఎన్నిక.. కీలక మలుపు

image

లోక్‌సభ ఎన్నికలు, కంటోన్మెంట్ ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ HYDలో కాంగ్రెస్‌ బలాన్ని పెంచుకుంటోంది. నిన్న మధ్యాహ్నం వరకు BJP కార్యక్రమాల్లో పాల్గొన్న కంటెస్టెడ్ MLA శ్రీగణేశ్.. ఎవరూ ఊహించని విధంగా సాయంత్రమే హస్తం కండువా కప్పుకొన్నారు. కంటోన్మెంట్ INC టికెట్ దాదాపు ఆయనకే ఖరారైందని టాక్. మరోవైపు BRS టికెట్ తనకే ఇవ్వాలని సాయన్న కూతురు నివేదిత అడుగుతున్నారట. ఇక BJP అభ్యర్థి ఎవరనేది‌ తెలియాల్సి ఉంది.

Similar News

News September 4, 2025

వ్యవసాయ వర్సిటీకి 24వ ర్యాంక్

image

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎన్‌ఐఆర్‌ఎఫ్- 2025 ర్యాంకింగ్స్‌లో దేశంలోనే 24వ స్థానంలో నిలిచింది. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ నివేదికలో వ్యవసాయ, అనుబంధ విశ్వవిద్యాలయాల పనితీరును పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి అల్దాస్ జానయ్య సంతోషం వ్యక్తం చేశారు. ఈ ర్యాంక్ సాధించడం తమ కృషికి నిదర్శనమని తెలిపారు.

News September 3, 2025

జూబ్లీహిల్స్ ముసాయిదా ఓటర్ లిస్ట్ రిలీజ్

image

జూబ్లీహిల్స్ ఓటరు ముసాయిదా జాబితాను జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ విడుదల చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉండగా వారిలో.. పురుషులు 2,04,228, మహిళలు 1,88,356, ఇతరులు 25 ఉన్నారన్నారు. సెప్టెంబర్ 17 వరకు అభ్యంతరాల స్వీకరణ, మార్పులు చేర్పులు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉంటుందని, సెప్టెంబర్ 30న జాబితా విడుదల చేస్తామని స్పష్టంచేశారు.

News September 2, 2025

లండన్‌లో యాక్సిడెంట్.. HYD వాసులు మృతి

image

లండన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో HYDకు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 2 కార్లు ఎదురెదురుగా ఢీకొనగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను నాదరుల్ చెందిన తర్రె చైతన్య (22), ఉప్పల్‌కు చెందిన రిషితేజ (21)గా పోలీసులు గుర్తించారు. గణేశ్ నిమజ్జనం చేసి వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు.