News September 3, 2024
HYD: కంట్రోల్ రూమ్‌లు 24 గంటలు పనిచేయాలి: CS

మంగళవారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. సోమవారం సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆమె టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..’జిల్లాల కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కంట్రోల్ రూమ్‌లు 24 గంటలు పనిచే సేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News January 6, 2026
హైదరాబాద్ నగరానికి యువీ!

టీమ్ ఇండియా మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు నొవాటెల్‌లో నిర్వహించనున్న ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. తన అభిమాన క్రికెటర్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఎయిర్‌పోర్టులో పోటీ పడ్డారు.
News January 6, 2026
బల్దియా.. 3 ముక్కలు అవుతోందయా!

పరిపాలనా సౌలభ్యం కోసం GHMCని 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ప్రస్తుతం 12 జోన్లు, 60 సర్కిళ్లతో ఉన్న బల్దియాను 6 జోన్ల HYD, 3 జోన్ల చొప్పున సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయనున్నారు. దీనికి అనుగుణంగా ఉన్నతాధికారుల బదిలీలు, JCల నియామకాలు జరుగుతున్నాయి. పాలక మండలి పదవీకాలం ముగిసిన వెంటనే కొత్త కార్పొరేషన్లు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశముంది.
News January 5, 2026
హైదరాబాద్‌లో ‘BTS’ మేనియా!

HYD జెన్-జీ కుర్రాళ్లకు పూనకాలు వచ్చాయి. ‘BTS’ కమ్‌బ్యాక్ ప్రకటనతో నేడు 15 మిలియన్ల ట్వీట్లు దాటిపోయి SM షేక్ అవుతోంది. క్రిప్టో మార్కెట్ పడిపోయినా లైట్ తీసుకుని, గ్రోక్ ఏఐ హ్యాక్స్, కోర్టు వార్తల మధ్య కూడా పర్పుల్ వైబ్స్‌తో కేఫ్‌లు మార్మోగుతున్నాయి. ఒత్తిడిని వీడి, యాక్టివిజం మీమ్స్‌తో కుర్రాళ్లంతా మాస్ హిస్టేరియా క్రియేట్ చేస్తున్నారు. 2026 అసలైన ‘స్టానింగ్’ రేసులో మనోళ్ల జోరు మాములుగా లేదు.


